Robinhood : రాబిన్ హుడ్ వచ్చేస్తోంది

Update: 2025-05-08 06:30 GMT

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, శ్రీలీల జంటగా నటించిన రీసెంట్ మూవీ 'రాబిన్ హుడ్'. వెంకీ కుడుముల ఈ హీస్ట్ కామెడీని తెరకెక్కించాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం మార్చి 28న రిలీజ్ అయింది. ప్రమోషనల్ కంటెంట్ తో ఆడియన్స్ దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం.. థియేటర్లలో పెద్దగా అలరించలేకపోయింది. మిక్స్ డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోతుంది. దీంతో నితిన్ ఖాతాలో మరో ఫ్లాప్ గా మిగిలిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతోనే తెరంగేట్రం చేశాడు. అయితే తాజాగా ఈ మూవీ స్మాల్ స్క్రీన్ మీదకు రావడానికి రెడీ అయింది. 'సంక్రాంతి వస్తున్నాం', తదితర చిత్రాలను ఒకే సమయంలో అటు ఛానల్లో, ఇటు ఓటీటీలోకి తీసుకొచ్చింది 'జీ, 5' సంస్థ. ఇప్పుడు 'రాబిన్ హుడ్’ విషయంలోనూ అదే ఫాలో అవుతోంది. ఈనెల 10న సాయంత్రం 6 గంటలకు ఈ సినిమా 'జీ తెలుగు’ ఛానల్లో ప్రసారం కానుందని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారు చేయలేదు. కానీ, అదే టైమ్క స్ట్రీమింగ్ కు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News