RRR Celebration Anthem: ఫ్యాన్స్‌కు 'ఆర్ఆర్ఆర్' మూవీ టీమ్ సర్‌ప్రైజ్..
RRR Celebration Anthem: ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలయిన నాటు నాటు పాట ప్రపంచమంతా ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసింది.;
RRR Celebration Anthem: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' మూవీ కోసం ప్రేక్షకులు రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పటికీ 7 సార్లు వాయిదా పడింది. చివరికి సంక్రాంతికి విడుదల అవుతుంది అనుకున్న సినిమా.. మూవీ ప్రమోషన్స్ అన్నీ పూర్తయ్యాక వాయిదా పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక చివరిగా మార్చి 25న ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.
'ఆర్ఆర్ఆర్' మూవీ ప్రమోషన్స్ సమయంలోనే ఈ సినిమా గురించి ఎక్కువ విశేషాలను బయటపెట్టింది మూవీ టీమ్. కానీ మామూలుగా ఆర్ఆర్ఆర్ నుండి బయటికి వచ్చిన అప్డేట్స్ తక్కువే. ఇప్పటికీ ఈ మూవీ నుండి జనని, నాటు నాటు.. ఈ రెండు పాటలే విడుదలయ్యాయి. అయితే అనుకోకుండా ఈ మూవీ నుండి మరో పాట విడుదలవుతుందన్న అప్డేట్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది.
ఇప్పటికే ఆర్ఆర్ఆర్ నుండి విడుదలయిన నాటు నాటు పాట ప్రపంచమంతా ఓ ట్రెండ్‌ను క్రియేట్ చేసింది. ఇక త్వరలోనే ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్‌గా 'ఎత్తర జెండా' పాట రిలీజ్‌కు సిద్ధమయ్యింది. మార్చి 14న ఈ పాట విడుదల కానున్నట్టు మూవీ టీమ్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అడగకుండానే ఆర్ఆర్ఆర్ టీమ్.. ఫ్యాన్స్‌కు ఇచ్చిన సర్‌ప్రైజ్‌కు వారు సంతోషపడుతున్నారు.
The joyful #RRRCelebrationAnthem is here to get your heart racing!
— Jr NTR (@tarak9999) March 10, 2022
Song out on March 14th.#RRRonMarch25th @ssrajamouli @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @OliviaMorris891 @mmkeeravaani @DVVMovies @RRRMovie #RRRMovie#EttharaJenda #Sholay #Koelae #EtthuvaJenda #EtthukaJenda pic.twitter.com/oSFecmatbo