RRR First Review: 'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎప్పటికైనా ఇదొక క్లాసిక్..!

RRR First Review: ఒక ఇండియన్ ఫిల్మ్ మేకర్ పెద్ద కలలు కనడమే కాకుండా దానిని సాధించి ఆర్ఆర్ఆర్‌తో అందరూ గర్వపడేలా చేశాడు.

Update: 2022-03-24 11:18 GMT

RRR First Review: దర్శక ధీరుడు రాజమౌళి చాలాకాలం తర్వాత మరో పాన్ ఇండియా సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ ఆడించడానికి సిద్ధమవుతున్నాడు. ఎన్‌టీఆర్, రామ్ చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' విడుదలకు ఇంకా కొన్ని గంటలే ఉండడంతో ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఆర్ఆర్ఆర్ ఎలా ఉందో ఫస్ట్ రివ్యూ బయటికి వచ్చేసింది.

'ఆర్ఆర్ఆర్' ఓ దేశభక్తి సినిమా. 1940ల్లో జరిగే ఓ కథ ఇది. ఇందులోనే తనదైన స్టైల్‌లో యాక్షన్, డ్రామా, ఎమోషన్స్ అన్నీ మిక్స్ చేశాడు జక్కన్న. పైగా ఈ మూవీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రమోషన్స్ కార్యక్రమాల్లో హీరోలు, దర్శకుడు చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే ఆర్ఆర్ఆర్‌కు వచ్చిన ఫస్ట్ రివ్యూ ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఓవర్సీస్ సెన్సార్ బోర్డ్ సభ్యుడు ఉమైర్ సంధు.. ఈ మధ్య పాన్ ఇండియా సినిమాలను ముందుగా ఫస్ట్ రివ్యూలను విడుదల చేస్తున్నాడు. ఇక తన రివ్యూలకు ప్రేక్షకుల్లో క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా ఆర్ఆర్ఆర్‌కు ఫస్ట్ రివ్యూను కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు ఉమైర్.

'ఒక ఇండియన్ ఫిల్మ్ మేకర్ పెద్ద కలలు కనడమే కాకుండా దానిని సాధించి చూపించి ఆర్ఆర్ఆర్‌తో అందరూ గర్వపడేలా చేశాడు. ఇది అసలు మిస్ అయ్యే సినిమా కాదు. ఈరోజు దీనిని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ అని పిలిచినా.. భవిష్యత్తులో ఇది ఒక క్లాసిక్‌గా మిగిలిపోతుంది. ఎన్‌టీఆర్, రామ్ చరణ్.. వారి కెరీర్‌లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. ఇదొక డెడ్లీ కాంబినేషన్. అజయ్ దేవగన్ అయితే సినిమాకు ఓ సర్‌ప్రైజ్ ప్యాకేజ్ అంటూ ఆర్ఆర్ఆర్ రివ్యూను తన సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఉమైర్ సంధు. 



Tags:    

Similar News