RRR Movie Ticket Price: తెలంగాణలో 'ఆర్‌ఆర్‌ఆర్' సినిమా టిక్కెట్ ధర పెంపు..
RRR Movie Ticket Price: తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్ ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;
RRR Movie Ticket Price: తెలంగాణలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టిక్కెట్ ధర పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. థియేటర్ల కేటగిరీల వారీగా రేట్లు పెంచే అవకాశం కల్పించింది. పెరిగిన రేట్లు సినిమా విడుదల నుంచి మూడు రోజుల పాటు మాత్రమే వర్తించనున్నాయి. స్పెషల్ ఐమాక్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లలో అసలు రేట్ల కంటే అదనంగా వంద రూపాయలు పెంచుకునే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మూడు రోజుల తర్వాత వంద నుంచి 50 రూపాయాలకు తగ్గించి అమ్మాలని ఉత్తర్వుల్లో తెలిపింది. అలాగే సాధారణ థియేటర్లలోనూ మూడు రోజుల పాటు 50 రూపాయలు అదనంగా అమ్ముకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.