Vijayendra Prasad : ఆ కథ వేరే వాళ్ళకి ఇచ్చి రాజమౌళిని బాధపెట్టిన విజయేంద్రప్రసాద్..!

Vijayendra Prasad : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది స్టార్ రైటర్ లలో ఒకరు విజయేంద్రప్రసాద్.. అయన కుమారుడు రాజమౌళి డైరెక్టర్‌‌గా ఫుల్ సక్సెస్‌‌లో ఈయన పాత్రే

Update: 2022-03-25 07:06 GMT

Vijayendra Prasad : టాలీవుడ్‌‌లో వన్ అఫ్ ది స్టార్ రైటర్ లలో ఒకరు విజయేంద్రప్రసాద్.. అయన కుమారుడు రాజమౌళి డైరెక్టర్‌‌గా ఫుల్ సక్సెస్‌‌లో ఈయన పాత్రే కీలకం.. రాజమౌళి డైరెక్షన్‌‌లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీకి కూడా విజయేంద్రప్రసాద్ కథని అందించారు.. అయితే మూవీ ప్రమోషన్‌‌లో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారాయన.

ఈ సందర్భంగా తను రాసిన కథని మరొకరికి ఇచ్చినప్పుడు రాజమౌళి బాధపడ్డాడని చెప్పుకొచ్చాడు. అదే సల్మాన్ ఖాన్ నటించిన 'భజరంగీ భాయ్‌జాన్‌'.. చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం మూవీ ఆధారంగా ఈ కథను రాసుకున్నారు విజయేంద్రప్రసాద్... ముందుగా ఈ కథను అమీర్ ఖాన్‌‌కి వినిపించారు.. కానీ ఆయన అంతగా ఆసక్తి చూపించకపోవడంతో సల్మాన్ ఖాన్‌‌ని అప్రోచ్ అయ్యారు.. అలా భజరంగీ భాయ్‌జాన్‌ తెరకెక్కింది.

అయితే ఈ కథను సల్మాన్‌‌కి చెప్పినప్పుడు రాజమౌళి బాధపడ్డారట.. రాజమౌళి బాధపడడం చూసిన విజయేంద్రప్రసాద్ ఈ కథను నీకోసం ఉంచేయనా అని అడిగారట.. లేదు వారికే ఇచ్చేయండి అని చెప్పాడట జక్కన్న. ఇక భజరంగీ భాయ్‌జాన్‌ రిలీజ్ అయ్యాక.. బాహుబలి పార్ట్‌ 1లో రెండు వేల మంది ఆర్టిస్టులతో ఫైట్‌ సీన్‌ జరుగుతోంది. అది రోహిణి కార్తె, ఎండలు మండిపోతున్నాయి. మంచి కాక మీదున్నప్పుడు అడిగారు. 15 రోజులు ముందో లేకా 15 రోజులు తర్వాతో అడిగినా ఆ కథ తానే తీసేవాడినని రాజమౌళి అన్నాడట. 

Tags:    

Similar News