RRR Trailer : ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్‌తో యూట్యూబ్ షేక్.. !
RRR Trailer : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్.;
RRR Trailer : టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు కలిసి నటిస్తోన్న సినిమా కావడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పునులతో బీజీగా ఉంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా గురువారం చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు మేకర్స్... తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలైన ఈ ట్రైలర్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇక యూట్యూబ్‌లో అయితే ఆర్‌ఆర్‌ఆర్ ట్రైలర్ రికార్డులు సృష్టిస్తోంది.
ఈ ట్రైలర్‌కు 24 గంటల్లో అన్ని భాషల్లో కలిపి 55 పైగా మిలియన్ల వ్యూస్ 2.576 మిలియన్ల లైకులతో రికార్డు బ్రేక్ చేసింది.
ఇక తెలుగు విషయానికి వస్తే ట్రైలర్‌కు 21.45 మిలిన్ల వ్యూస్ రాగా.. 1.243 మిలియన్ల లైక్స్ వచ్చాయి.
హిందీలో.. 23 పైగా మిలియన్ల వ్యూస్, 805 వేల వ్యూస్ వచ్చాయి.
తమిళ్ లో 3.3 మిలియన్ల వ్యూస్, 206 వేల లైక్స్ వచ్చాయి.
కన్నడలో 5.5మిలియన్ల వ్యూస్, 141వేల లైక్స్ వచ్చాయి.
ఇక మలయాళంలో 2.5 మిలియన్ల వ్యూస్, 180 వేల లైక్స్ వచ్చాయి. ఇంకా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది.
కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నాడు. డివివి దానయ్య దాదాపు నాలుగువందల కోట్ల ఖర్చుతో ఈ సినిమాని నిర్మిస్తుండగా, కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ లభించింది. సినిమా నిడివి దాదాపు మూడు గంటల ఆరు నిమిషాల 54 సెకన్ల నిడివి ఉందట. వచ్చే ఏడాది జనవరి 7న థియేటర్లలోకి రాబోతోంది.