Sara Tendulkar: హీరోయిన్‌గా అడుగుపెట్టనున్న స్టార్ క్రికెటర్ కూతురు..
Sara Tendulkar: క్రికెట్‌లో ఇండియన్ టీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినవారిలో సచిన్ టెండుల్కర్ ఒకరు.;
Sara Tendulkar: ఎక్కువశాతం సెలబ్రిటీల వారసులు చూపులు అన్నీ సినీ పరిశ్రమ వైపే ఉంటాయి. ఇప్పుడు కాదు ఎప్పటినుండి అయినా ఇది కామన్‌గా జరిగేదే. కేవలం నటీనటుల వారసులు మాత్రమే కాదు.. ఇతర విభాగాల్లోనే సెలబ్రిటీల వారసులు కూడా సినీ పరిశ్రమలో స్టార్‌గా ఎదగాలనుకుంటారు. ఇక తాజాగా ఆ జాబితాలోకి ఓ స్టా్ర్ క్రికెటర్ కూతురు చేరనుంది.
క్రికెట్‌లో ఇండియన్ టీమ్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చినవారిలో సచిన్ టెండుల్కర్ ఒకరు. అందుకే ఆయనను క్రికెట్ గాడ్ అని పిలుచుకుంటారు. ఇక సచిన్ టెండుల్కర్ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. కొడుకు అర్జున్ టెండుల్కర్ కూడా క్రికెట్‌లోనే స్థిరపడి ఉండగా.. కూతురు సారా మాత్రం త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.
సారా టెండుల్కర్‌కు ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాను అప్‌లోడ్ చేసే ఫోటోలకు లక్షల్లో లైకులు వచ్చిపడుతుంటాయి. ఒకవైపు మెడిసిన్ చేస్తూనే మరోవైపు మోడల్‌గా బిజీగా ఉంది సారా. ఇప్పటివరకు పలు యాడ్స్‌లో నటించిన సారా.. త్వరలోనే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందట. ఇంతకు ముందు కూడా సారా బాలీవుడ్ ఎంట్రీ గురించి రూమర్స్ వచ్చాయి. అయితే ఈసారైనా ఈ రూమర్స్ నిజమా కాదా చూడాలి.