Chiranjeevi : చిరంజీవి సినిమాలో సాయిదుర్గాతేజ్, నిహారిక

Update: 2025-02-15 13:45 GMT

మెగా ఫ్యామిలీలో మరో మల్టీస్టారర్ రాబోతోంది. అంటే మరీ మల్టీస్టారర్ అనలేం కానీ.. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘విశ్వంభర’లో మరో మెగా హీరో నటిస్తున్నాడు అనే వార్తలు రోజంతా వచ్చాయి. ఆ హీరో సాయి దుర్గాతేజ్ అని తేలిపోయింది. ఆల్రెడీ చిన్న మామ పవన్ కళ్యాణ్ తో ‘బ్రో’అనే మూవీలో కలిసి నటించాడు సాయితేజ్. ఇప్పుడు పెద్ద మామ సినిమాలో నటించబోతున్నాడు. అయితే బ్రోలో అతనిదే కీలక పాత్ర. ఈ సారి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు అని కూడా అనుకున్నారు. అది నిజమే. ఈయన సినిమాలో కనిపిస్తాడు కానీ పాత్రగా కాదుట. అంతేకాదు.. సాయితేజ్ తో పాటు నిహారిక కూడా ఉండబోతోంది.

ఈ ఇద్దరూ కలిసి విశ్వంభరలో చిరంజీవి ఇంటర్డక్షన్ సాంగ్ లో కనిపిస్తారట అంతే. దీనికే నానా హడావిడీ కనిపించింది సోషల్ మీడియాలో. పాటల్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం చాలా సినిమాల్లో చాలామంది హీరోల ఫ్యామిలీ మెంబర్స్ ను చూశాం. ఇదీ అలాంటిదేనట.

ఇక బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్ట్ చేస్తోన్న విశ్వంభరలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. కునాల్ కపూర్ విలన్ పాత్రలో నటిస్తుండగా.. అషికా రంగనాథ్, సురభి, ఇషా చావ్లా ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తోన్న విశ్వంభరను సమ్మర్ తర్వాత విడుదల చేసే అవకాశాలున్నాయి. 

Tags:    

Similar News