Sai Durga Tej : అతని రాక కోసం ఈ నేల చాలా ఎదురు చూసింది

Update: 2024-10-15 08:43 GMT

కొన్ని సినిమాలు ఆరంభం నుంచే ఆకట్టుకుంటాయి. ఓపెనింగ్ రోజు నుంచే సినిమా చూడాలి అనే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. అలాంటి సినిమాలు అరుదుగా ఉంటాయి. తమ సినిమా అలాంటి అరుదైనదే అనిపించుకునేలా ఉన్నాడు సాయిదుర్గా తేజ్. అతని కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ చూస్తే మరో బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడా అనిపించక మానదు. అలా ఉంది. విలేజ్ సెటప్ అదీ చూస్తే విరూపాక్షను గుర్తుకు తెచ్చినా.. కంటెంట్ పరంగా మరో బలమైన కథతో వస్తున్నాడనిపిస్తుంది. హను మాన్ తో ప్యాన్ ఇండియా స్థాయిలో పరిచయమైన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని రోహిత్ కే.పి డైరెక్ట్ చేస్తున్నాడు. మళయాలీ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి కథా నాయికగా నటిస్తోంది. ఆ మధ్య తన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది.

సాయిదుర్గా తేజ్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన వీడియో సింప్లీ సూపర్బ్ అనిపించుకుంటోంది. ఈ నేల అతని రాక కోసం చాలాకాలంగా ఎదురు చూస్తోంది అనే లైన్ తో స్టార్ట్ అయిన వీడియోలో సెట్స్ మేకింగ్, టెక్నికల్ ఎసెట్స్ గురించిన పరిచయంతో పాటు చివర్లో సిక్స్ ప్యాక్ ను మించిన కండలతో కనిపిస్తోన్న సాయిదుర్గాతేజ్ ఎంట్రీతో అదిరిపోయేలా ఉంది. చూడగానే వెరీ ప్రామిసింగ్ అనిపించుకుంటోంది. విశేషం ఏంటంటే.. ఈ వీడియోలో సినిమాకు సంబంధించిన విజువల్స్ ఏం లేవు. జస్ట్ మేకింగ్ కు సంబంధించినవే ఉన్నాయి. అయినా ప్రామిసింగ్ అనిపించుకుంటోందంటే.. సాయితేజ్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేలానే ఉన్నాడనుకోవచ్చు. 

Full View

Tags:    

Similar News