Naatu Naatu Song : 'నాటు.. నాటు' పాట ఫై సమంత ఇలా... సిద్ధార్థ్ అలా..!
Naatu Naatu Song : యూట్యూబ్‌లో ట్రిపుల్ ఆర్ సందడి షురూ అయింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి మరో సాంగ్ కొన్ని గంటల క్రితం విడుదలైంది..;
Naatu Naatu Song : యూట్యూబ్‌లో ట్రిపుల్ ఆర్ సందడి షురూ అయింది.. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ట్రిపుల్ ఆర్ మూవీ నుంచి మరో సాంగ్ కొన్ని గంటల క్రితం విడుదలైంది.. ఇప్పటికే దోస్త్ మీద పాట విడుదల కాగా.. రెండోపాట నాటు నాటు అంటూ ఊర మాస్‌గా ఉంది.. చంద్రబోస్ లిరిక్స్ అందించిన ఈపాటను కీరవాణి కంపోజ్ చేశారు.
రాహుల్ సిప్లిగంజ్ అద్భుతంగా పాడారు.. వింటుంటేనే ఊపొస్తున్న ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. సాంగ్ ఏ లెవెల్లో ఉందో.. అందుకు తగ్గట్టుగానే ఊర మాస్ స్టెప్పులతో జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ దుమ్ము రేపారు.
ఈ సాంగ్‌ను ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ చేశారు.. ఈ సాంగ్‌ను వింటూ ఇద్దరి స్టెప్పులను చూస్తూ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.. ఈ పాట పైన సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వీడియోని ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మెంటల్ అంటూ రియాక్ట్ అయింది.
ఇక దీనిపైన హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ.. ఎగ్జైట్ మెంట్ ని అపుకోలేకపోతున్నాను.. ఇండియన్ సినిమాలో గొప్ప డాన్సర్లెనా చెర్రీ, ఎన్టీఆర్ ఇద్దరు కలిసి మంటపుట్టిస్తున్నారు. ధియేటర్లో ఇక అరుపులే.. ఇదే రాజమౌళి మ్యాజిక్ అంటూ ట్వీట్ చేశాడు.
ఇక శరవేగంగా షూటింగ్ పూర్తిచేసుకుంటున్న ట్రిపుల్ ఆర్ మూవీ జనవరి ఏడున ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. సినిమా పైన భారీ అంచనాలున్నాయి.