పబ్లిగ్ ఫిగర్స్ ఎప్పుడూ నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదంటే అనర్థాలు తప్పవు అనేందుకు ఇదో ఎగ్జాంపుల్. తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని కోర్ట్ ఆదేశించింది. కొన్నాళ్ల క్రితం కేటీఆర్ పై విమర్శలు చేస్తూ.. అతను సమంతను బెదిరించాడని.. నాగ చైతన్యను వదిలేసి తనతో ఉండాలని బ్లాక్ మెయిల్ చేశాడనీ.. ఆ ఇద్దరి ఫోన్లను ట్యాప్ చేసి అనేక సీక్రెట్స్ తెలుసుకున్నాడనీ.. అసలు నాగ చైతన్య, సమంత విడిపోవడానికి కేటీఆర్ ఫోన్ ట్యాపింగే కారణం అని కొండా సురేఖ తీవ్రమైన ఆరోపణలు చేసింది. అంతే కాక తనకు కొన్ని ఫేవర్స్ చేయడానికి కేటీఆర్ చెప్పినట్టు చేయాలని నాగార్జున కూడా సమంతను బలవంతం చేశాడనే నీచమైన ఆరోపణలు కూడా ఉన్నాయందులో.
దీంతో ఈ విషయంపై కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశాడు నాగార్జున. అప్పట్లో కోర్ట్ కేస్ ను పరిగణలోకి తీసుకుంది. గత యేడాది డిసెంబర్ 12నే కొండా సురేఖను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఆ తర్వాత మరికొందరు సాక్షుల వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకున్న కోర్ట్ తాజాగా ఆమెపై క్రిమినల్ కేస్ నమోదు చేయాలని పోలీస్ లను ఆదేశించింది. మరి ఈ వ్యవహారంలో కొండా సురేఖ ఇంకెన్ని చిక్కుల్లో పడబోతుందో చూడాలి.