Samyuktha Menon : తెలుగు కన్నా మలయాళమే బెటర్.. సంయుక్త మీనన్ హాట్ కామెంట్

Update: 2024-05-11 09:11 GMT

తెలుగు చిత్రసీమలోకి వచ్చిన కొంత కాలంలోనే విజయాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగారు సంయుక్త, ప్రస్తుతం తెలుగుతోపాటు మలయాళ భాషల్లో వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్ చేశారు.

టాలీవుడ్లో నటించాలంటే కష్టమన్నారు సంయుక్త మీనన్. 'మలయాళంతో పోలిస్తే తెలుగు సినిమాల్లో నటించాలంటే చాలా కష్టం, భాష రాకపోవడం ఒక కారణమైతే.. మేకప్ మరో కారణం. వినడానికి వింతగా ఉన్నా.. నా వరకు అది చాలా పెద్ద విషయం. మలయాళ సినిమాల్లో చేసేటప్పుడు మేకప్ చేసుకోవడం వెంటనే అయిపోతుంది. చాలా లైట్ గా, సహజంగా వేస్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు కూడా పూర్తి స్వేచ్ఛ ఉన్నట్లు అనిపిస్తుంది" అని చెప్పారు.

టాలీవుడ్ లో స్వీయ జాగ్రత్తలు చాలా తీసుకోవాలనీ.. తెరపై ఎలా కనిపిస్తామా.. అని ఎప్పుడూ చూసుకుంటూ ఉండాలని సంయుక్త చెప్పారు. ఎక్కువ మేకప్ వేస్తారనీ.. షాట్ చేస్తున్నప్పుడు కూడా మేకప్ ను చెక్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇది సౌకర్యంగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News