Mahesh Babu: మళ్లీ ఆ మలయాళ బ్యూటీనే కావాలంటున్న త్రివిక్రమ్.. మహేశ్ సినిమాలో ఛాన్స్..
Mahesh Babu: మహేశ్‌తో చేసే సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా త్రివిక్రమ్ భీమ్లా నాయక్ బ్యూటీనే తీసుకునే అవకాశాలు ఉన్నాయి.;
Mahesh Babu: ఇటీవల మహేశ్ బాబుకు కరోనా నిర్దారణ అయ్యింది. అదే సమయంలో తన అన్న రమేశ్ బాబు కూడా మృతిచెందారు. ఇలా మహేశ్ బాబు సినిమాలకు వరుసగా బ్రేక్ పడింది. ఇటీవల ఈ హీరోకు నెగిటివ్ వచ్చింది. దీంతో మళ్లీ వెంటనే సినిమా షూటింగ్లలో పాల్గొనాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న అప్‌కమింగ్ సినిమావైపే అందరి దృష్టి ఉంది.
పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా ఏప్రిల్‌లో విడుదల కానుందని మూవీ టీమ్ చాలాకాలం క్రితమే అనౌన్స్ చేసింది. కానీ దానికి తగిన స్పీడ్‌లో షూటింగ్ మాత్రం జరగట్లేదు. చాలా కారణాల వల్ల సర్కారు వారి పాట షూటింగ్ ఇప్పటికీ చాలాసార్లు పోస్ట్‌పోన్ అయ్యింది. అంతే కాకుండా దీని వల్ల మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రానున్న సినిమాపై కూడా ఎఫెక్ట్ పడుతోంది.
ఇప్పటికే త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్, రానా మల్టీ స్టారర్ భీమ్లా నాయక్ సినిమాలో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించకపోయినా.. మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ.. భీమ్లా నాయక్‌కు సపోర్ట్‌గా నిలబడుతున్నారు. దీని తర్వాత వెంటనే మహేశ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఇందులో సెకండ్ హీరోయిన్‌గా భీమ్లా నాయక్ బ్యూటీనే తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే మహేశ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రెండు హిట్స్ ఉండడంతో.. ఇప్పుడు కూడా వీరి కాంబినేషన్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా మలయాళ భామ సంయుక్త మీనన్‌ను తీసుకుంటున్నట్టు సమాచారం. తెలుగులో ఇంకా ఒక్క సినిమా విడుదల కాకముందే సంయుక్త రెండు తెలుగు చిత్రాలలో నటించే అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం.