Kannappa : మంచు విష్ణు కన్నప్పలో శరత్ కుమార్ పవర్ ఫుల్ రోల్

Update: 2024-07-15 09:31 GMT

డైనమిక్ హీరో విష్ణు మంచు 'కన్నప్ప' ప్రాజెక్ట్ మీద ఇండస్ట్రీలో అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ తో కన్నప్ప బజ్ క్రియేట్ చేయగలిగింది. సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, విజువల్స్ గురించి చర్చ జరుగుతోంది. కన్నప్ప రిలీజ్ కోసం మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.

కన్నప్ప వాడిన విల్లు విశేషాలు నెట్టింట్లో ట్రెండ్ అయ్యాయి. తాజాగా కన్నప్ప చిత్రం నుంచి శరత్ కుమార్ పాత్రకు సంబంధించిన అప్ డేట్ వచ్చింది. శరత్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన కారెక్టర్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. శరత్ కుమార్ నాథనాధుడిగా కనిపించబోతున్నారు. పోస్టర్ లో ఆయన ఉగ్రరూపం కనిపిస్తోంది.

అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఈ చిత్రాన్ని మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీకి ముఖేష్ ' కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టీఫెన్ దేవస్సీ సంగీతాన్ని అందిస్తున్నారు.

Tags:    

Similar News