సీక్వెల్, ప్రీక్వెల్ సినిమాలకు ఇన్ స్టంట్ ప్రమోషన్ ఉండటంతో దర్శకనిర్మాతలు వాటి బాట పడుతున్నారు. దీంతో.. ప్రీక్వెల్ చిత్రాల నిర్మాణం బాగా పెరిగింది. ఈ ధోరణి అన్ని భాషా చిత్రాల్లో ఉంది. కార్తీ నటించిన 'సర్దార్ ' సినిమా తెలుగు, తమిళ భాషల్లో విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తోంది.
'సర్దార్ 2' చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. సినిమా చిత్రీకరణ జూలై15 నుండి చెన్నైలో ప్రారంభం కానుంది. పీస్. మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. సర్దార్ తొలిభాగంలో తదుపరి మిషన్ కంబోడియాలో జరుగనుందని చెప్పారు.
దాంతో సర్దార్ 2 సినిమా నేపథ్యం కంబోడియా అవుతుందని భావిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. జార్జ్ సి.విలియమ్స్ కెమెరామన్ గా వ్యవహరిస్తున్నారు.