Nani : సరిపోదా శనివారం.. ఇది టీజర్ కాదంటున్నారు.

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తోన్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 26న విడుదల కాబోతోంది. సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ఎస్జే సూర్య బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్. కానీ దీనికి నాట్ ఏ టీజర్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేయడం విశేషం.;

Update: 2024-07-20 09:06 GMT

నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తోన్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీ ఆగస్ట్ 29న విడుదల కాబోతోంది. సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన ఎస్జే సూర్య బర్త్ డే సందర్భంగా ఓ టీజర్ విడుదల చేసింది మూవీ టీమ్. కానీ దీనికి నాట్ ఏ టీజర్ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేయడం విశేషం. ఈ టీజర్ కాని టీజర్ చూస్తోంటేనే కథేంటో టూకీగా అర్థం అయిపోతుంది. పురాణాల్లో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడిని మించిన వాడొకడు ఇప్పున్నాడు. సత్య భామతో కలిసి శ్రీ కృష్ణుడు నరకుడిని సంహరించినట్టుగా నాని, ప్రియాంక కలిసి ఆ నరకుడిని పోలిన పాత్ర చేస్తోన్న ఎస్. జే సూర్యను సంహరించడమే ఈ కథా నేపథ్యంగా కనిపిస్తోంది.

బర్త్ డే మేన్ సూర్య మరోసారి చాలా ఫెరోసియస్ రోల్ ప్లే చేస్తున్నట్టు అర్థం అవుతోంది. ప్రియాంక కానిస్టేబుల్ గా నటించిందని గతంలోనే చెప్పారు. ఆ స్టేషన్ ఇన్స్ పెక్టరే ఈ సూర్య అనుకోవచ్చు. మరి శ్రీ కృష్ణుడులాంటి పాత్ర చేస్తోన్న నాని క్యారెక్టరైజేషన్ఏంటో కానీ.. ఈ టీజర్ అదిరిపోయింది. అంతకు మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎక్స్ ల్లెంట్ అనేలా ఉంది. జేక్స్ బెజోయ్ ఈ మూవీకి సంగీతం చేస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లో సరితూగే సమరమే సంహారం తథ్యమే అనే లైన్స్ ఆకట్టుకుంటున్నాయి.

నాని, వివేక్ ఆత్రేయ కాంబోలో ఇంతకు ముందు వచ్చిన అంటే సుందరానికి అనుకున్నంత గొప్పగా ఆకట్టుకోలేదు. అయినా అతనికి మరో ఛాన్స్ ఇచ్చాడు నాని. ఆ చాన్స్ ను గట్టిగానే వాడుకున్నాడు అనేలా ఉంది ఈ మూవీ నుంచి వస్తోన్న అప్డేట్స్. ఆగస్ట్ 29న ఈ మూవీని ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మేకర్ డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.

Tags:    

Similar News