'Scam 2003' Teaser: 'స్కామ్ 2003' స్ట్రీమింగ్ పై సోనీ లైవ్ లేటెస్ట్ అప్ డేట్.. టీజర్ రిలీజ్
'స్కామ్ 2003' టీజర్ రిలీజ్... రూ.30వేల కోట్ల నకిలీ స్టాంప్ పేపర్లపై స్టోరీ;
ఇండియన్ స్టాక్ మార్కెట్ లో సంచలనం సృష్టించిన హర్షద్ మెహతా కథ ఆధారంగా వచ్చిన వెబ్ సిరీస్ 'స్కామ్ 1992'. హన్సల్ మెహతా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే తరహాలో 'స్కామ్ 2003' రాబోతోంది. 2003లో స్టాంప్ పేపర్ మోసానికి పాల్పడిన అబ్దుల్ కరీం తెల్గీ కథను ఈ సారి తెరపై చూపించబోతున్నారు. ఈ సిరీస్ కు హన్సల్ మెహతా నిర్మిస్తుండగా.. తుషార్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా గగన్ దేవ్ రియార్ ఈ సిరీస్ లో ప్రధాన పాత్ర పోషించారు. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం సోనీ లైవ్ మూడో వార్షికోత్సవం సందర్భంగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ పై ఓ క్రేజీ న్యూస్ ను రిలీజ్ చేసింది. 'స్కాన్ 2003' సెప్టెంబర్ 2 నుంచి ఓటీటీలో ప్రీమియర్ కానున్నట్టు వెల్లడించింది. అంతే కాదు ఈ స్ట్రీమింగ్ డేట్ తో పాటు ఓ ఇంట్రస్టింగ్ టీజర్ ను కూడా విడుదల చేసింది. 1992లో జరిగిన ఈ స్కామ్ నేపథ్య సన్నివేశాలతో ప్రారంభమైన ఈ టీజర్.. ఆద్యంతం ఆసక్తిగా సాగింది.
'స్కామ్ 2003' కథేంటంటే..
నకిలీ స్టాంప్ పేపర్లతో అబ్దుల్ కరీం తెల్గీ రూ.30వేల కోట్లు కూడబెట్టినట్టు అంచనా. సంజయ్ సింగ్ అనే జర్నలిస్ట్ ఈ మోసాన్ని బహిర్గతం చేశారు. 'రిపోర్టర్ కీ డైరీ' అనే పేరుతో ఆయన రాసిన ఓ పుస్తకం ఆధారంగా మేకర్స్ ఈ సిరీస్ ను తెరకెక్కిస్తున్నారు. కర్ణాటకలోని ఖానాపూర్ కు చెందిన అబ్దుల్ అంత సులువుగా అందర్నీ ఎలా మోసం చేశాడన్నది ఈ సిరీస్ ముఖ్య కథాంశంగా రాబోతోంది.
టీజర్ ఎలా ఉందంటే..
ఇక 'స్కామ్ 2003' టీజర్ విషయానికొస్తే.. ఇందులో అబ్దుల్ కరీం తెల్గిని వెనుక నుంచి, సైడ్ యాంగిల్స్ లో చూపించారు. అతని ముఖం ఎక్కడా కూడా కనిపించకుండా మేకర్స్ జాగ్రత్త వహించారు. ఇక ఈ టీజర్ లో ఓ డైలాగ్ మాత్రం ప్లే అయింది. నాకు డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బు సంపాదించడం కాదు, సంపాదించింది అంటూ ఒక డైలాగ్ వినిపించగా, మీరు ముందుకు సాగాలంటే జీవితంలో, మీరు మరింత ధైర్యంగా ఉండాలి అంటూ మరో డైలాగ్ సిరీస్ పై మరింత క్యూరియాసిటీని కలిగిస్తున్నాయి. ఇది 'స్కామ్ 1992'లో అత్యంత పాపులర్ అయిన లైన్ రిస్క్ ఉంటే, ప్రేమ ఉంటుందన్న దాన్ని గుర్తు చేస్తోంది.
Full View
ఇక సోనీ లైవ్ కూడా ఇదే విషయాన్ని తెలుపుతూ.. “ఆట పెద్దదే.. మరి ఆటగాడు .!అబ్దుల్ కరీం తెల్గీ ఇండియాలో చేసిన అతిపెద్ద కుంభకోణం కథ. ఇది ఊహించలేని స్థాయిలో దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ సెప్టెంబరు 2 నుంచి సోని లీవ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది అంటూ రాసుకువచ్చింది.
Khel bada tha, aur khiladi...!
— Sony LIV (@SonyLIV) August 4, 2023
The story of one of India's biggest scam by Abdul Karim Telgi, which shocked the nation with its unimaginable scale.
Streaming on 2nd September, only on Sony LIV@SonyLIV @SonyLIVIntl pic.twitter.com/EcK578UuoO