Senior Actress Pushpalatha : సీనియర్ నటి పుష్పలత కన్నుమూత

Update: 2025-02-05 11:45 GMT

టాలీవుడ్ సీనియర్ నటి పుష్పలత (87) కన్నుమూశారు. ఆమె కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న రాత్రి చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచింది. తమిళనాడులోని కోయం బత్తూరు పుష్పలత స్వస్థలం. తొమ్మిదవ ఏటనే పుష్పలత భరతనాట్యంలో శిక్షణ పొందారు. నటుడు ఎస్సే నటరాజ్ దర్శక త్వం వహించి, నిర్మించిన ‘నల్ల తంగై' అనే తమిళ చిత్రం ద్వారా 1955లో నటిగా ఆరం గేట్రం చేశారు. తర్వాత 1962లో 'కొంగు నాట్టు తంగం' సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమయ్యారు. తెలుగు, తమిళం, మలయాళం అలాగే కన్నడ భాషల్లో 100కు పైగా సినిమాలు చేసిందీమె. ఎన్టీఆర్ హీరోగా కోవెలమూడి భాస్కర్ రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'చెరపకురా.. చెడేవు' అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. తమిళ సినిమాలో ప్రముఖ హీరోలైన ఎంజిఆర్, శివాజీ గణేషన్, జైశంకర్, జెమినీ గణేషన్ లతో కలిసి నటించింది. అనంతరం తెలుగు ఇండస్ట్రీలో ఆ తర్వాత ఆడబిడ్డ, మా ఊరిలో మహాశివుడు, వేటగాడు, ఆటగాడు, ఘరానా దొంగ, రక్త బంధం, శూలం, కొండవీటి సింహం, ఇద్దరు కొడుకులు, ప్రతిజ్ఞ, మూగవాని పగ, ఉక్కుమ నిషి, రంగూన్ రౌడీ, విక్రమ్ వంటి చిత్రాలలో నటించి తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. తమిళంలో ఏవీఎం రాజను జంటగా 'నానుమ్ ఒరు పెన్' అనే చిత్రంలో నటించారామె. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టడంతో 1964లో పెళ్లి చేసు కున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వారిలో ఒకరు నటి మహాలక్ష్మి. ఆమె తమిళ, తెలుగు చిత్రాల్లో నటించారు.

Tags:    

Similar News