Shankar Dada MBBS : ఆగస్టు 22న శంకర్‌దాదా MBBS రీరిలీజ్

Update: 2024-08-16 10:00 GMT

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న శంకర్‌దాదా MBBS మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన మున్నాభాయ్ MBBSకు రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది. ఇలా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News