Shanmukh Jaswanth: షణ్నూ కల నెరవేరింది.. చాలాసార్లు ఓడిపోయిన తర్వాత..
Shanmukh Jaswanth: షణ్నూ.. తన కల నెరవేరింది అంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.;
Shanmukh Jaswanth (tv5news.in)
Shanmukh Jaswanth: ముందుగా ఒక యూట్యూబర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి.. కవర్ సాంగ్స్‌తో, షార్ట్ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జశ్వంత్. ఇక బిగ్ బాస్ అవకాశం తన ప్రొఫెషనల్‌తో పాటు పర్సనల్ లైఫ్‌ను కూడా మలుపు తిప్పేసింది. ప్రస్తుతం తన తరువాతి ప్రాజెక్ట్స్‌పై దృష్టి పెట్టిన షణ్నూ.. తన కల నెరవేరింది అంటూ పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్‌గా మారింది.
బిగ్ బాస్ సీజన్ 5లో మెరిసిన కంటెస్టెంట్స్ అందరూ ప్రస్తుతం ఎవరి ప్రాజెక్ట్స్‌లో వారు బిజీగా ఉన్నారు. అయితే అందరికంటే ఎక్కువగా షణ్నూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తన పర్సనల్ లైఫ్‌లో చోటు చేసుకున్న మార్పులు, తన గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయనతో బ్రేకప్‌లాంటి అంశాలు కొంతకాలం హాట్ టాపిక్‌గా నడిచాయి. అయితే కొంతకాలంగా ఎవరితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వని షణ్నూ తాజాగా తన కల నెరవేరింది అంటూ పోస్ట్ పెట్టాడు.
ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం. వారి అభిమాన హీరోను కలుసుకోవాలని అందరికీ ఓ డ్రీమ్ ఉంటుంది. ఆ కల నెరవేరినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అయితే షణ్నూకు అలాంటి డ్రీమ్ హీరో సూర్య అని చాలా సందర్భాల్లో చెప్పాడు. అలాంటి తన అభిమాన హీరోను కలుసుకునే అవకాశం షణ్నూకు ఇన్నాళ్లకు దక్కింది.
తన అప్‌కమింగ్ మూవీ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు సూర్య. అదే సమయంలో షణ్నూకు సూర్యను కలిసే అవకాశం దక్కింది. అయితే సూర్య, షణ్నూ కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'గత కొన్ని నెలలకు ఎన్నోసార్లు ఓడిపోయిన తర్వాత ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను.' అంటూ సూర్యకు ఐ లవ్ యూ అని చెప్తూ పోస్ట్ పెట్టాడు. అంతే కాకుండా కలలు కూడా నిజమవుతాయి అంటూ ఎమోషనల్‌గా ఇన్‌స్టా్గ్రామ్ స్టోరీని కూడా షేర్ చేశాడు.