Bigg Boss 5 Telugu: మెంటల్‌గా డిస్ట్రబ్ అవుతున్నా.. ఒకరితో రిలేషన్‌లో ఉన్నా: షణ్ముఖ్
Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ 5 మొదలయినప్పటి నుండి షన్నూ, సిరి, జెస్సీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు.;
Bigg Boss 5 Telugu (tv5news.in)
Bigg Boss 5 Telugu: అసలు బిగ్ బాస్ హౌస్‌లో ఏం జరుగుతుందో రోజురోజుకీ ప్రేక్షకులకు కూడా అర్థం కావడం లేదు. నామినేషన్ ప్రకియ, కెప్టెన్సీ టాస్క్ వచ్చిందంటే చాలు.. ఎమోషన్స్‌ను పట్టించుకోకుండా గేమ్‌పైనే దృష్టి పెడుతున్నారు అందరు. దీని వల్ల కలిసిమెలసి ఉంటున్న హౌస్‌మేట్స్ మధ్య కూడా గొడవలు వస్తున్నాయి. ఇటీవల సిరి, షన్నూ మధ్య వచ్చిన గొడవ హాట్ టాపిక్‌గా మారింది.
బిగ్ బాస్ సీజన్ 5 మొదలయినప్పటి నుండి షన్నూ, సిరి, జెస్సీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఎంత గొడవపడినా.. మళ్లీ వారే కలిసిపోయి సంతోషంగా ఉండేవారు. ఇటీవల ఆరోగ్య సమస్య వల్ల బిగ్ బాస్ నుండి జెస్సీ తప్పుకున్నాడు. దీంతో ఈ బ్యాచ్.. ఒక బెస్ట్ ఫ్రెండ్‌ను కోల్పోయింది. ఈ విషయం షన్నూను బాధించి డిప్రెషన్‌లోకి వెళ్లేలాగా చేసింది.
ఈవారం నామినేషన్స్ ప్రకియ సమయంలో హౌస్‌మేట్స్ మనసులో ఉన్న విషయాలను బయటపెట్టి ఇద్దరు హౌస్‌మేట్స్‌ను నామినేట్ చేయమని బిగ్ బాస్ అన్నారు. అప్పుడు చాలామంది హౌస్‌మేట్స్ మధ్య మనస్సర్థలు వచ్చాయి. ఇంకా హౌస్‌మేట్స్ అదే మూడ్‌లో ఉన్నారు. అదే సమయంలో షన్నూ దిష్టి తాడు తెగిపోవడంతో దానిని సిరి తన రక్తపు చుక్క అంటించి మరింత గట్టిగా కట్టింది. ఇంత బాగున్న వారి మధ్య అనుకోకుండా పెద్ద గొడవే జరిగింది.
సిరి, షన్నూ మధ్య గొడవలు సహజం. కానీ ఈసారి ఆ గొడవ మరింత సీరియస్ పరిణామాలకే దారితీసింది. ఈ క్రమంలో షన్నూ.. సిరి మీద పట్టరాని కోపంతో మొఖం చూస్తేనే చిరాకుగా ఉందంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. సిరి తాను ఏడుస్తున్నాడని అర్థం చేసుకుని ఓదార్చడానికి వెళ్లింది. అయినా కూడా షన్నూ కోపంతో తనను అక్కడి నుండి వెళ్లిపో అని గట్టిగా గట్టిగా అరిచాడు. ఇదంతా హౌస్‌మేట్స్ వింటున్నా కూడా వారి గొడవ మధ్యలో మనమెందుకు అని సైలెంట్‌గా ఉండిపోయారు.
సిరి ఓదారుస్తున్నా పట్టించుకోకుండా దీప్తిని గుర్తుచేసుకుని ఏడ్చాడు షన్నూ. నువ్వు, నీ ఫ్రెండ్‌షిప్ ఏదీ అవసరం లేదని అరవడంతో సిరి వాష్‌రూమ్‌లోకి వెళ్లి గట్టిగా తలుపు వేసేసుకుంది. ఆ తర్వాత తల గోడకేసి కొట్టుకున్న శబ్దం విన్న షన్నూ డోర్ తీయమని అరిచాడు. అప్పుడు హౌస్‌మేట్స్ అందరూ వచ్చి డోర్ కొట్టగా సిరి బయటకు వచ్చింది. అప్పుడు షన్నూ.. సిరిని దగ్గర తీసుకొని ఓదార్చాడు. అలా మళ్లీ వాళ్లిద్దరూ కలిసిపోయారు.