క్రేజీ సినిమా ఒకటి ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది. శర్వానంద్, కృతీ శెట్టి హీరో హీరోయిన్లుగా, చైల్డ్ ఆర్టిస్టు విక్రమాదిత్య కీలక పాత్రలో నటించిన చిత్రం 'మనమే'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన చిత్రం ఇది. జూన్ 7న ఈ చిత్రం విడుదలైంది. తాజాగా, ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉంది.
పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేదు. కానీ, బాక్సాఫీసు వద్ద లాభాలను తెచ్చిపెట్టింది. శర్వానంద్, కృతీ శెట్టి జోడికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. వీరిద్దరి నటనే సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. మనమే చిత్రం విడుదల సమయంలో బాక్సాఫీస్ బరిలో పెద్దగా సినిమాలు లేకపోవడంతో శర్వానంద్‌కు ప్లస్ అయింది.
కామెడీ,ఎమోషన్స్ అన్నీ కలగలపిన మూవీ మనమే. జూలై 12 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.