Shruti Haasan: బాయ్‌ఫ్రెండ్‌తో శ్రుతి సెల్ఫీ.. ఫోటో వైరల్
Shruti Haasan: కమల్ హాసన్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది శ్రుతి హాసన్..;
Shruti Haasan : కమల్ హాసన్ కూతురిగానే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది శ్రుతి హాసన్.. తెలుగులో స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యింది. గతంలో ఒక ఫోటోగ్రాఫర్ ను ప్రేమించింది.. వారి వ్యవహారం పెళ్లి పీటల వరకు వచ్చింది. కానీ అంతలోనే ఏమైందో ఏమో అతడిని పక్కన పెట్టేసింది.
ప్రస్తుతం శాంతను హజారిక అనే చిత్రకారుడితో ప్రేమాయణం సాగిస్తోంది. తరచు అతడితో కలిసి దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అతడిపై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తుంటుంది.. శాంతను కూడా శృతి గురించి పోస్టులు పెడుతుంటాడు.
తాజాగా శ్రుతి ప్రియుడు శాంతనుతో కలిసి దిగిన సెల్ఫీని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, శ్రుతి, శాంతను 2020లో తమ రిలేషన్ ను అధికారికంగా ప్రకటించారు. లాక్‌డౌన్ నుంచి వీరిద్దరు కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు.
శ్రుతి ఇటీవల శాంతను బర్త్ డేను సెలబ్రేట్ చేసింది. ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు మై లవ్ శాంతను.. ప్రతి రోజు మిమ్మల్ని తెలుసుకుంటున్నందుకు నేను కృతజ్ఞురాలిని అని రాసుకొచ్చింది. ఇక శ్రుతి సినిమాల విషయానికి వస్తే టాలీవుడ్ హీరో ప్రభాస్ తో కలిసి సలార్ లో నటిస్తోంది.