‘సౌత్ ఇండియన్ యాసలో ఏదైనా చెప్పండి’ అంటూ ప్రశ్నించిన నెటిజన్‌పై హీరోయిన్ శ్రుతి హాసన్ ( Shruti Haasan ) అసహనం వ్యక్తం చేశారు. ‘ఇలాంటి వివక్షలు వద్దు. మీరు మమ్మల్ని ఇడ్లీ, సాంబార్ అని అనడం మంచిది కాదు. మీరు మమ్మల్ని అనుకరించలేరు. మాలాగా ఉండేందుకు ప్రయత్నించొద్దు’ అని ఘాటు రిప్లై ఇచ్చారు. బాలీవుడ్ నటులు దక్షిణాది యాక్టర్లను చిన్న చూపు చూస్తారనే విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆమె ఇలా సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల జామ్‌నగర్‌లో ఆకాష్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలో రామ్ చరణ్‌ను వేదికపైకి ఆహ్వానిస్తున్నప్పుడు షారుక్ ఖాన్ ‘ఇడ్లీ వడ’ అని అనడంతో కలకలం సృష్టించింది. ఆ ఘటన శ్రుతి అసహనానికి కారణమై ఉండొచ్చని పలువురు అంటున్నారు. ‘మీరు సింగిలా? లేదా రిలేషన్‌లో ఉన్నారా?’ అని ఇటీవల ఒకరు ప్రశ్నించగా.. తనకు ఈ తరహా ప్రశ్నలు నచ్చవని శ్రుతి హాసన్ పేర్కొన్నారు. సినిమాల విషయానికొస్తే.. ‘డకాయిట్, ‘చెన్నై స్టోరీ’ల్లో నటిస్తున్నారు. ‘సలార్’ సీక్వెల్ ‘సలార్ 2’ లోనూ సందడి చేయనున్నారు.