Singer Sunitha : ఎర్రటి ఎండలో గానుగతో చెరుకు రసం తీసిన సునీత

Singer Sunitha : ఒక్కోసారి వయసు గుర్తుకు రాదు.. కొన్నింటిని చూస్తే చిన్న పిల్లల్లా మారి పోవాలనిపిస్తుంది..

Update: 2022-05-04 14:45 GMT

Singer Sunitha : ఒక్కోసారి వయసు గుర్తుకు రాదు.. కొన్నింటిని చూస్తే చిన్న పిల్లల్లా మారి పోవాలనిపిస్తుంది.. ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు.. ఈ మధ్యే కొత్తగా కనిపిస్తోంది.. చెరకు రసాన్ని ఇలా కూడా తీస్తారా అని సింగర్ సునీతకి ఎంతో ఆశ్చర్యం.. రోడ్డు మీద రయ్ మంటూ దూసుకుపోతున్న కారుకు సడెన్ గా బ్రేకులు పడ్డాయి.

చెరకు రసం బండి దగ్గర ఆగి తానూ ఓ చెయ్యి వేసింది.. పాటలు, డబ్బింగులతో బిజీగా ఉన్నా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అప్పుడప్పుడు టూర్లు వేస్తుంటుంది. ఇక్కడైతే ఎవరో ఆమెని గుర్తించి చుట్టుముట్టేస్తారు.. ఏ ఊరో ఏమో కానీ ఎర్ర గౌనులో గాగుల్స్ పెట్టుకుని యంగ్ హీరోయిన్ లా మెరిసిపోతోంది సునీత.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సునీత తన చిన్న చిన్న సరదాలకు సంబంధించిన చిత్రాలను పోస్ట్ చేస్తుంటుంది.. అవి చూసి ఒక్కొక్కరు ఒక్కో రీతిలో స్పందించినా సున్నితంగా మందలిస్తుందే తప్ప సీరియస్ గా తీసుకోదు.. ఎవరి ఆనందం వారిది అని వదిలేస్తుంది.

Full View

Tags:    

Similar News