Singer Sunitha : ప్రవస్థి ఆరోపణలపై స్పందించిన సునిత

Update: 2025-04-22 14:03 GMT

పాడుతా తీయగా షోలో తనను కావాలనే తొక్కేశారు అంటూ రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది గాయని ప్రవస్థి. తను ఈ షోలో చిన్నతనం నుంచి పార్టిసిపేట్ చేస్తోంది. ఇన్నేళ్లుగా ఎప్పుడూ లేనిది ఇప్పుడే ఇలా జరుగుతోందని.. జడ్జెస్ బయాస్డ్ గా ఉంటున్నారని ఆరోపిస్తూ.. సింగర్ సునిత, లిరిసిస్ట్ చంద్రబోస్ తో పాటు మరో జడ్జ్.. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిపై కొన్ని ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రవస్థి .. సునితను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు మరింత వైరల్ అయ్యాయి. దీంతో ప్రవస్థి చేసిన ఆరోపణలకు స్పందిస్తూ సునిత ఓ వీడియో విడుదల చేసింది.

సునిత కూడా ప్రవస్థి చెప్పిన ఒక్కో అంశాన్ని ప్రస్తావిస్తూ ఆ సందర్భంలో అలా ఎందుకు ప్రవర్తించామో.. వివరించే ప్రయత్నం చేసింది. కొన్ని పాటల విషయంలో పక్షపాతంతో ఉన్నారు అనే ఆరపణపై.. ఆ ఛానల్ కు ఉన్న మ్యూజికల్ రైట్స్ ను బట్టే పాటలఎంపిక ఉంటుంది. అలాగే ఒకేపాట ఎక్కువ సార్లు రిపీట్ అయినా మార్చేస్తారు. అంతే తప్ప కొందరిని టార్గెట్ చేస్తూ ఇలా చేయడం ఉండదు అని చెప్పింది. చిన్నప్పటి నుంచి ముద్దు చేశాం అన్న మాటలపైనా రియాక్ట్ అయింది. ‘అప్పుడు పాడినట్టే ఇప్పుడూ పాడి ఉంటే’అలాగే స్పందించేవాళ్లం అన్నది. అలాగే సెట్స్ లో లేట్ అయినప్పుడు టీమ్ కు స్నాక్స్, లేదా భోజనాలు తను, కీరవాణి ఇలా ఎవరో ఒకరు అప్పుడప్పుడూ స్పాన్సర్ చేస్తాం అని.. అది నువ్వు ఎలిమినేట్ అయినందుకు కాదు అన్నది. ఇక ప్రవస్థి తల్లి మా అందరి పిల్లలనూ ఉద్దేశిస్తూ అందరినీ నాశనం అయిపోవాలని శపించిందని.. అందుకే ఆమెను వెళ్లిపోమని చెప్పా అంది. ఇక భవిష్యత్ లో ఎదగాలనుకుంటే ఆవేశం మంచిది కాదు అని హితవు చెప్పింది. ఇవాళ్టి యువతరం ఆవేశం ఆపుకోలేక నానా యాగీ చేస్తున్నారంది. ఏదైనా గురువులు నేర్పింది ఆచరించాలని.. అలా చేశాం కాబట్టే ఇప్పుడు మేం గురు స్థానంలో ఉన్నాం అంది. అలాగే మ్యూజిక్ టీమ్ పై దురుసుగా ఉంటుంది సునిత అన్నమాటల పై.. నేను అలా ఉన్నాను అని ఒక్కరితో అయినా చెప్పించు అని సవాల్ చేసింది.

ఫైనల్ గా చాలా విషయాలు దాచిపెట్టి తనకు కావాల్సిందేదో చెప్పుకుంటోంది తప్ప.. వాస్తవాలు ఏంటీ అనేది అక్కడ అనేక కెమెరాల్లో రికార్డ్ అయింది. అవి చూపిస్తే అప్పుడేం చేస్తావు అంటూ నిలదీసింది. ఏదేమైనా ఈ గొడవ గురించి జ్ఞాపిక టీమ్ వాళ్లు కూడా రియాక్ట్ అవుతారు మరిన్ని నిజాలు చెబుతారు అంటూ ముగించింది సునిత. మరి దీనిపై ప్రవస్థి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News