Sree Vishnu : ‘సింగిల్’గాళ్ల బతుకు సిరాకైంది

Update: 2025-04-17 12:00 GMT

శ్రీ విష్ణు హీరోగా కేతిక శర్మ, ఇవనా హీరోయిన్లుగా నటించిన సినిమా ‘సింగిల్’. వెన్నెల కిశోర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నాడు. ఆ మధ్య విడుదల చేసిన టీజర్ తో బాగా ఇంప్రెస్ చేశారు. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. టైటిల్ కు తగ్గట్టుగా సింగిల్ గాళ్ల కష్టాలను తెలియజేసేలా ఉందీ పాట. సింగిల్ గా ఉంటే బతుకంతా సిరాగ్గా ఉంటుందని చెబుతూ హీరో చేసే ఉద్బోధలా ఉంది. ‘సిరాకైంది సింగిల్ బతుకు లేనేలేదు హస్కు బుస్కు.. సిరాకైంది సింగిల్ బతుకు.. ఇక తప్పదు మందుగ్లాస్ మనకు’ అంటూ మొదలైన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా రాహుల్ సిప్లిగంజ్ పాడాడు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు.

‘ఎనకి దిరిగి చూసుకుంటే లెక్కా.. కాఫీ షాప్ ఖర్చులన్నీ బొక్కా.. గుండేలేని గుమ్మలు షోకేస్ లో బొమ్మలు.. నమ్ముకున్న నాబోటోడికి చెవిలో పువ్వులు.. అమ్మో వీళ్ల యాక్షన్ అంటే కత్తులులేని ఫ్యాక్షనూ.. ఈ కాలపు లైలాలంటే మజ్నుకైనా టెన్షనే’ అంటూ అమ్మాయిల మనస్తత్వాలను చెబుతూ తానెందుకు సింగిల్ గా ఉండిపోయాడు అనేదానికి కారణాలు చెబుతూ హీరో చెప్పుకునే బాధలా ఉంది.

ఇక ఈ చిత్రాన్ని మే 9న విడుదల చేయబోతున్నారని టాక్. ఆ రోజు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు కూడా వస్తోందన్నారు. అయినా ఈ చిన్న సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారంటే హరిహర వీరమల్లు మరోసారి వాయిదా పడుతున్నట్టేనా..?

Full View

Tags:    

Similar News