SJ Suryah : విలన్ క్యారెక్టర్ కోసం ఏడు కోట్లు డిమాండ్ చేసిన ఎస్‌జే సూర్య
SJ Suryah : పలు హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి దర్శకుడిగా ఫుల్ సక్సెస్ అయిన ఎస్‌జే సూర్య ఆ తర్వాత నటుడుగా మారాడు.;
SJ Suryah : పలు హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించి దర్శకుడిగా ఫుల్ సక్సెస్ అయిన ఎస్‌జే సూర్య ఆ తర్వాత నటుడుగా మారాడు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురగదాస్ డైరెక్షన్ లో వచ్చిన 'స్పైడర్' సినిమాలో విలన్ గా నటించి గజగజలాడించాడు. సినిమా ప్లాప్ అయినప్పటికీ ఎస్‌జే సూర్య నటనకి మాత్రం అంతా ఫిదా అయిపోయారు. ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటుడుగా పలు ఇండస్ట్రీలలో సినిమాలతో బిజీగా ఉన్న సూర్యకి ఓ తెలుగు నిర్మాత ఒక పాత్రను ఆఫర్ చేసాడట.. అయితే ఆ పాత్ర చేసేందుకు ఏకంగా ఏడు కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసి పెద్ద షాకిచ్చాడట సూర్య.. అయితే అది ఏ మూవీ అన్నది తెలియాల్సి ఉంది.