Sobhita Dhulipala : నాగచైతన్యతో ఎంగేజ్‌మెంట్.. శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు
నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో సింపుల్‌గా ఇది జరగడంపై శోభితా తాజాగా స్పందించారు ‘‘ఆ క్షణాలను పూర్తిగా ఆస్వాదించాలనుకున్నా. ఇలాంటి వేడుకలు గ్రాండ్‌గా జరగాలని నేను ఎప్పుడూ కలలు కనలేదు. సింపుల్, ప్రశాంతంగా.. సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేసేలా జరగాలని అనుకున్నా. అదే విధంగా మా ఎంగేజ్‌మెంట్ జరిగింది’’ అని శోభిత తెలిపారు. ఇక తానెప్పుడూ పెళ్లి చేసుకొని, పిల్లలను కన్నట్లుగా ఊహించుకునేదాన్నని కూడా శోభిత తెలిపింది. అయితే అలాంటివి జరిగినప్పుడు తాను తెలుగు సాంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తానని స్పష్టం చేసింది. నాగ చైతన్య, శోభిత నిశ్చితార్థం ఆగస్ట్ 9న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకూ వాళ్లు తమ పెళ్లి తేదీని మాత్రం అనౌన్స్ చేయలేదు. కానీ పెళ్లికి తాను ఎలాంటి చీర కట్టుకుంటానన్నది కూడా ఇదే ఇంటర్వ్యూలో శోభిత తెలిపింది. సాధారణంగా తెలుగు పెళ్లిళ్లలో అమ్మాయిలు ఎర్రటి అంచు ఉండే తెలుపు రంగు పట్టు చీర కట్టుకుంటారు. తాను కూడా అలాంటిదే ప్లాన్ చేస్తున్నట్లు చెప్పింది. నిశ్చితార్థం సమయంలో ఆమె మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన లంగా ఓణీలో మెరిసిపోయింది.