Sravana Bhargavi : వివాదానికి ఎండ్.. ఆ వీడియో తొలగించిన శ్రావణభార్గవి..

Sravana Bhargavi : సింగర్‌ శ్రావణభార్గవి... ఒకపరి కీర్తన వీడియో వివాదానికి తెరదింపే ప్రయత్నం చేసింది.;

Update: 2022-07-23 15:45 GMT

Sravana Bhargavi : సింగర్‌ శ్రావణభార్గవి... ఒకపరి కీర్తన వీడియో వివాదానికి తెరదింపే ప్రయత్నం చేసింది. సోషల్‌ మీడియా నుంచి ఆ వీడియోను తొలగించింది. గత కొన్ని రోజులుగా ఒకపరి అన్నమయ్య కీర్తనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. అటు అన్నమాచార్య కుటుంబ సభ్యుల నుంచి... ఇటు అన్నమయ్య అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అయితే ఆ వీడియోలో తప్పేమి లేదని వాదించిన శ్రావణ భార్గవి.. ఇప్పడా వీడియోను తొలగించింది. అంతేకాదు.. వేరే ఆడియోతో మళ్లీ వస్తానని ప్రకటించింది.

అన్నమాచార్య కీర్తనతో వీడియో చేయడంపై అన్నమయ్య అభిమానులు.. శ్రావణ భార్గవిని విమర్శలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఆమె తొలగించారు. దీంతో ఈ వివాదానికి తెరపడినట్లయ్యింది.

Tags:    

Similar News