Sravanthi Chokarapu : రెండుసార్లు పెళ్లి చేసుకున్నా : స్రవంతి చొక్కారపు
Sravanthi Chokarapu : బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ శనివారం గ్రాండ్ గా స్టార్ట్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా ఈ షో ప్రసారం అవుతోంది. ';
Sravanthi Chokarapu : తెలుగు బిగ్‌బాస్ ఓటీటీ సీజన్ శనివారం గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో 24*7 నాన్ స్టాప్‌గా ఈ షో ప్రసారం అవుతోంది. 'బిగ్‌బాస్ నాన్‌స్టాప్' పేరుతో ప్రసారం కానున్న ఈ షోకి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్ చేస్తున్నారు. దిస్ ఈస్ బిగ్‌బాస్ నాన్‌స్టాప్ అంటూ స్మాల్ స్క్రీన్‌పైకి వచ్చేసిన నాగార్జున.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బిగ్‌బాస్‌ని చూసేయొచ్చనని చెప్పాడు.
ఇక హౌజ్ లోకి ఒక్కో కంటెస్టెంట్‌ను పిలుస్తూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు నాగ్. తొలి కంటెస్టెంట్స్‌గా అషురెడ్డి హౌజ్ లోకి అడుగుపెట్టగా ఆ తర్వాత మహేశ్ విట్టా, ముమైత్‌ఖాన్, అజయ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ స్రవంతి చొక్కారపు ఎంట్రీ ఇచ్చింది.
ఈ సందర్భంగా నీ గురించి ఎవరికీ తెలియని సిక్రెట్ ఏదైనా చెప్పు అని నాగార్జున అడగగా, తను రెండు సార్లు పెళ్లి చేసుకున్నానని. అయితే ఒక్కసారి పారిపోయి చేసుకుంటే.. తర్వాత ఇంట్లో వాళ్ల ముందు మళ్లీ అతన్నే పెళ్లి చేసుకున్నానని చెప్పింది. బిగ్‌బాస్ హౌజ్ పై తనకి పెళ్లైందని చెప్పడం సంతోషంగా ఉందని తెలిపింది. ఇక తన స్మైల్ గురించి రోజుకో వంద కామెంట్లు వస్తాయంటూ సిగ్గుపడిపోయింది.
స్రవంతి ఆంధ్రప్రదేశ్‌లోని కదిరి.. అనంతపురంలో పుట్టి పెరిగింది. 2009లో చదువు పూర్తి అయిన తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత యాంకర్‌గా మారి పలు టీవీ ఛానల్ లో పనిచేసింది. ప్రస్తుతం బెస్ట్ ఆఫ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో యాంకర్ గా చేస్తోంది. ఇటీవల శ్రీదేవి డ్రామా కంపెనీ షోతో పాటు జబర్దస్త్‌లోని కొన్ని ఎపిసోడ్‌లలో మెరిసింది. కాగా స్రవంతి... ప్రశాంత్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ పవన్ కళ్యాణ్ కి వీరాభిమానులు కావడంతో వీరి కుమారుడికి అఖిరా నందన్ అని పేరు పెట్టారు.