కన్నడ, తెలుగు, బ్రిటన్ సోయం శ్రీలీల (Sree Leela) ఊపుమీదుంది. ఆమె మంచి డాన్సర్. ఇప్పుడున్న హీరోయిన్లలో డాన్సు విషయంలో తనే నెంబర్ వన్. అయితే.. అదే తన ప్లస్సూ, మైనస్సు. శ్రీలీలలోని డాన్సర్‌ని చూపించాలన్న తపనతో.. తనలోని నటిని మరుగున పడేశారు దర్శకులు.
ఆమె డ్యాన్స్ చూసి.. శ్రీలీలతో ఐటెమ్ సాంగ్ చేయించుకోవాలని చాలామంది అనుకొన్నారు. శ్రీలీల హీరోయిన్‌గా వరుసగా ఫెయిల్ అవుతూ వస్తోంది. ఇప్పుడు ఐటెమ్ గీతం ఒప్పుకొంటే, తన కెరీర్ మరింత డామేజ్ అవుతుందేమో, తనని ఐటెమ్ గాళ్ కిందే లెక్క గడతారేమో అనే భయాలు ఆమెలో ఉన్నాయి. హీరోయిన్ గా అవకాశాలు లేకపోవడం వల్లే, ఐటెమ్ గీతం ఒప్పుకొందని అంటారని శ్రీలీల భయం. అందుకే ఐటెమ్ గీతాలకు నో చెబుతోంది.
హీరోయిన్ గా ఫామ్‌లో ఉండి, వరుసగా రెండు మూడు హిట్లు కొడితే, అప్పుడు మరో లెక్క. అందుకే ముందు హీరోయిన్‌గా తనని తాను నిరూపించుకోవాలనుకొంటోంది శ్రీలీల. అందుకే ఐటెమ్‌లకు ఒప్పుకోవడం లేదు. శ్రీలీల కనిపించగానే డాన్సులు చేయించడంపైనే ఫోకస్ పెట్టి, తనలోని నటిని బయటకు రానివ్వకుండా చేసిన దర్శకులదే తప్పని ఆమె ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.