Srileela : నితిన్ కు దొరికిపోయిన శ్రీ లీల

Update: 2024-12-07 12:15 GMT

ప్రస్తుతం దేశం మొత్తాన్ని దెబ్బలు పడతయ్ రో అంటూ బెదిరిస్తోన్న బ్యూటీ శ్రీ లీల తాజాగా నితిన్ ను ఇబ్బంది పెట్టాలని ఈజీగా దొరికిపోయింది. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి రాబిన్ హుడ్ అనే మూవీలో నటిస్తున్నారు. వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని డిసెంబర్ 20న విడుదల చేయబోతున్నారు. రీసెంట్ గా విడుదల చేసిన టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సారి గ్యారెంటీగా కొడుతున్నా అని నితిన్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. అటు వెంకీ కుడుముల కూడా మరోసారి ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ లో ఉన్నాడు. ఇటు నితిన్ తో పాటు శ్రీలీల ఇద్దరి కెరీర్ స్లంప్ లో ఉంది. రాబిన్ హుడ్ తమను గట్టెక్కిస్తుందనుకుంటున్నారు. ఈ ఇద్దరి పాట కూడా బాగా ఆకట్టుకుంటోందీ మూవీ నుంచి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం చేస్తున్నాడు.

ఇక తాజాగా ప్రమోషనల్ యాక్టివిటీనా లేక షూటింగ్ టైమ్ లోనా అనేది తెలియదు కానీ.. ‘హీరోగారు’అనే బోర్డ్ రాసి ఉన్న రూమ్ లో కూర్చుని తన ఫోన్ చూసుకుంటున్నాడు నితిన్. అక్కడికి వచ్చిన శ్రీలీల కలర్ పెన్ తో హీరో అన్న చోట ఇన్ చేర్చి ‘హీరోయిన్ గారు’అని మార్చింది. మార్చడమే కాదు.. నా రూమ్ లో ఎందుకు కూర్చుకున్నారు అంటూ నితిన్ ను దబాయించింది. బట్ అది ప్రాంక్ అని వెంటనే గ్రహించిన నితిన్.. అదెలా అంటాడు. కావాలంటే బయట బోర్డ్ చూడమని చెప్పింది శ్రీ లీల. బోర్డ్ చూసిన నితిన్.. ఆ Heroine స్పెల్లింగ్ లో ine అనే అక్కరాలనే చేతితోనే చెడిపేశాడు. ప్రాంక్ ఇలా కాదు చేసేదంటూ శ్రీలీలకు సెటైర్ కూడా వేశాడు. పాపం పాప.. తన ప్లాన్ వర్కవుట్ అవుతుందనుకున్న ఈ దెబ్బలు కొట్టే బ్యూటీ సైలెంట్ అయిపోయింది. 

Tags:    

Similar News