Lucky Baskhar : దుల్కర్, మీనాక్షిది లవ్ మ్యారేజా.. అరేంజ్డ్ మ్యారేజా..?

Update: 2024-10-15 10:54 GMT

దుల్కర్ సాల్మన్, మీనాక్షి చౌదరి అసలు పెళ్లెప్పుడు చేసుకున్నారు..? లవ్వో, అరేంజ్డో కావడానికి అనుకుంటున్నారు కదా. నిజమే.. కాకపోతే ఇది సినిమా పెళ్లి.. సినిమాలో పెళ్లి. ఈ ఇద్దరూ కలిసి నటించిన సినిమా లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని సితార, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ నిర్మించాయి. ఈ నెల 31న లక్కీ భాస్కర్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈ మూవీ నుంచి కోపాలు చాలండీ శ్రీమతిగారు అంటూ ఓ వీడియో సాంగ్ విడుదల చేశారు. జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన ఈ ట్యూన్ చాలా ప్లెజెంట్ గా కనిపిస్తోంది. వినగానే ఆకట్టుునేలా ఉంది. శ్రీమణి అందించిన సాహిత్యానికి జీవీ బ్యూటీఫుల్ ట్యూన్ ను అంతే అందంగా పాడారు.. విశాల్ మిశ్రా, శ్వేతా మోహన్.

కాపురాలు అన్నప్పుడు కలహాలు, కలతలు, అలకలు, ఆనందాలు, అదుపులు అన్నీ ఉంటాయి. ఇలాంటి ఓ అలక సందర్భాన్ని ఎదుర్కొన్న ఓ శ్రీవారు తన శ్రీమతిని కోపాలు చాలించమని వేడుకుంటున్న సందర్భంగా వచ్చే పాటలా ఉంది. దుల్కర్, మీనాక్షి జోడీ నేచురల్ గా ఉంది. ఈ మూవీకి వీరే హైలెట్ అవుతారని కూడా అనిపిస్తోంది. అంత సహజంగా పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక పాట మధ్యలో వారి పిల్లవాడు వచ్చి.. ‘మీది లవ్ మ్యారేజా,, అరేంజ్డ్ మ్యారేజా’ అని అడగడం ఆ వెంటనే వీరు ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లడం.. ఆ ఎపిసోడ్ ను ఈ పాటలో మాంటేజ్ గా వాడిన విధానం ఇంకా బావుంది. మొత్తంగా లక్కీ భాస్కర్ లో ఈ పాటకు ఓ ప్రత్యేకం స్థానం ఉండేలా కనిపిస్తుంది. 

Full View

Tags:    

Similar News