SSMB 28: మహేష్ బాబు కోసం ఇద్దరు హీరోయిన్లు రంగంలోకి..

SSMB 28.. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. ఎట్టకేలకు సినిమా సెట్స్ పైకి వెళ్లింది. సహ నిర్మాత నాగ వంశీ వ్యవహరిస్తున్నారు.

Update: 2023-01-16 10:57 GMT

SSMB 28: SSMB 28.. మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్‌ల కలయికలో వస్తున్న మూడవ చిత్రం. ఎట్టకేలకు సినిమా సెట్స్ పైకి వెళ్లింది. సహ నిర్మాత నాగ వంశీ వ్యవహరిస్తున్నారు. మొత్తం ఏడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలన్నది నిర్మాణ బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టు 11, 2023 విడుదల చేయాలని శరవేగంగా షూటింగ్ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. 



ఇక ఈ చిత్రంలో మహేష్ బాబుతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు పూజా హెగ్డే, శ్రీలీలను ఎంపిక చేశారు. శ్రీలీల రవితేజతో నటించిన "ధమాకా" హిట్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇంకా ఈ చిత్రానికి థమన్ స్వరాలు సమకూర్చనున్నాడు.



గతంలో 'అతడు', 'ఖలేజా' మహేష్‌బాబు-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన రెండు చిత్రాలు. ఒకటి బ్లాక్ బస్టర్ అయితే మరొకటి హిట్ టాక్ తెచ్చుకోకపోయిన విమర్శకుల ప్రశంలు అందుకుంది. 

Tags:    

Similar News