Sudheer Babu : సుధీర్ బాబు సూపర్ హిట్స్ లోడింగ్ లా ఉందే..

Update: 2024-09-24 08:55 GMT

కృష్ణ అల్లుడుగా, మహేష్ బబు బావగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు సుధీర్ బాబు. బట్ చాలా త్వరగానే తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశాడు. డ్యాన్స్ లు, ఫైట్లలో ప్రత్యేకత చూపించే ప్రయత్నం చేశాడు. కండలు పెంచాడు. ఆ కండలతో బాలీవుడ్ లో విలన్ గానూ కనిపించాడు. బట్ తను ఆశిస్తోన్న స్టార్డమ్ మాత్రం ఇంకా రాలేదు అనే చెప్పాలి. సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉన్న హీరోగా మిగిలిపోతున్నాడు. అతను హార్డ్ వర్క్ చేస్తున్నా అదృష్టం కలిసి రావడం లేదు. 2018లో వచ్చిన నన్ను దోచుకుందువటే తర్వాత ఇప్పటి వరకూ మళ్లీ హిట్ పడలేదు. బట్ దేనికైనా టైమ్ రావాలి అంటారు కదా.. సుధీర్ కు ఇప్పుడు ఆ టైమ్ వచ్చినట్టుగానే ఉంది.

ప్రస్తుతం రెండు సినిమాలతో రెడీ అవుతున్నాడు సుధీర్ బాబు. వీటిలో దసరా సందర్భంగా విడుదల కాబోతోన్న మా నాన్న సూపర్ హీరో ముందుగా విడుదలవుతుంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ వచ్చిన కంటెంట్ అంతా చాలా అంటే చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. రీసెంట్ గా వచ్చిన పాట సైతం ఇంప్రెసివ్ గా ఉంది. ఫాదర్, సన్ సెంటిమెంట్ నేపథ్యంలో ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలకు భిన్నమైన కంటెంట్ లా కనిపిస్తోంది. ఈ మూవీత అతనికి బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే కలరింగ్ కనిపిస్తోందని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటున్నారు.


ఇక మరో మూవీ‘జటాధర’. శివుడునే జటాధర అంటాం కదా. ఈ మూవీ అనౌన్స్ మెంట్ తో పాటు వచ్చిన పోస్టర్స్ అదిరిపోయాయి. లేటెస్ట్ గా షూటింగ్ స్టార్ట్ అయిందంటూ మరో పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ చూడగానే వావ్ అనేలా ఉంది. ఆకాశం అల్లకల్లోలంగా కనిపిస్తోంటే.. ఆ వెనకే ఆకాశం నుంచి కాళీమాత ఆగ్రహంగా ఉన్నట్టుగా కింద బైక్ పై సుధీర్ వెళుతున్నట్టుగా ఉందీ పోస్టర్. ఈ మధ్య కాలంలో పోస్టర్ తోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా అంటే ఇదే అని చెప్పాలి. వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శివిన్ నారంగ్ తో పాటు తనూ నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సో.. ఈ రెండు సినిమాలతో సుధీర్ ఇమేజ్ మారే అవకాశాలున్నాయంటున్నారు. 

Tags:    

Similar News