రీతు వర్మ ( Reethu Varma ).. పొందికైన అందాల తెలుగు భామ. గత ఏడాది అనువాద చిత్రం మార్క్ అంటోనీతో సినీ ప్రియులని అలరించిన ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం శ్రీ విష్ణుతో స్వాగ్ లో నటిస్తోంది.
రీతు వర్మ ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ తో రీతు వర్మ జతకట్టనుంది. దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. దర్శకుడు నక్కిన త్రినాథ రావు, రచయిత బెజవాడ ప్రసన కుమార్ ఇప్పుడు సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది.
రావు రమేష్ పక్కన కథానాయిక అను అంబానీ చేస్తుండగా, సందీప్ కిషన్ తో రీతు వర్మ చేస్తోంది అని సమాచారం. సందీప్ కిషన్ పక్కన ముందు కొత్తమ్మాయి కోసం ట్రై చేశారు.. కానీ డిఫరెంట్ అందం రీతు వర్మ ఐతే బెటర్ అని ఆమెను పిక్ చేశారని టీమ్ తెలిపింది.