Super Star Krishna: ఒక శకం ముగిసింది.. : అశ్రునయనాలతో కృష్ణకు అంతిమ వీడ్కోలు

Super Star Krishna: ఒక శకం ముగిసింది. ఓ తార నేలరాలింది. తెలుగు చలన చిత్రంలో తనకంటూ ప్రత్యక స్థానం ఏర్పరుచున్న దిగజ నటుడు దివికెగిశారు.

Update: 2022-11-16 07:40 GMT

Super Star Krishna: ఒక శకం ముగిసింది. ఓ తార నేలరాలింది. తెలుగు చలన చిత్రంలో తనకంటూ ప్రత్యక స్థానం ఏర్పరుచున్న దిగజ నటుడు దివికెగిశారు. తెలుగు సినీ ప్రపంచాన్ని విషాదంలోకి నెట్టేస్తూ సూపర్ స్టార్ కృష్ణ అనంతలోకాలకు వెళ్లిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మృతితో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కన్నీరు మున్నీరౌతున్నారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు అభిమానులు, సినీ ప్రముఖులు భారీగా పద్మాలయ స్టూడియోకు తరలివస్తున్నారు. పద్మాలయ స్టూడియోలో సూపర్ స్టార్ భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. అభిమానుల రాకతో పద్మాలయ స్టూడియో జనసంద్రంగా మారింది.


భారీ సంఖ్యలో స్టూడియో వద్దకు అభిమానుల రావడంతో వారిని నిలువరించలేకపోతున్నారు.. సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు. ఇక తమ అభిమాన నటుడిని చివరిసారి చూసి కన్నీటి వీడ్కోలు తెలుపుతున్నారు.

కాసేపట్లో సూపర్ స్టార్ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. పద్మాలయ స్టూడియో నుంచి ఫిల్మ్ నగర్ మహాప్రస్థానం వరకు ఈ అంతిమ యాత్ర సాగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


ఈ మేరకు మహాప్రస్తానంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతిమయాత్ర నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పద్మాలయ స్టూడియో నుంచి ఫిల్మ్ నగర్ మహాప్రస్తానం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇక సినీ రాజకీయ ప్రముఖులు కృష్ణతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. తన నటనతో అందరి మనస్సు దోచుకున్న ఆంధ్రా కౌబాయ్ ఇక లేరనే విషయాన్ని జీర్జించుకోలేకపోతున్నారు. ఒక్కింత భావోద్వేగానికి లోనై కన్నీటి పర్యంతమౌతున్నారు.


మహా నటుడికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా తరలివస్తున్నారు. ఏపీ సీఎం జగన్, మంత్రి రోజా, తెలంగాణ గవర్నర్ తమిళిసైతో పాటు పలువురు ప్రముఖులు సూపర్ స్టార్ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు.

Tags:    

Similar News