Suriya into Malayalam : మళయాలంలోకి సూర్య

Update: 2025-11-19 08:03 GMT

ఎన్నాళ్లో వేచిన కాలం అన్నట్టుగా సూర్య తెలుగులో అడుగు పెట్టాడు. తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టాడు. సితార బ్యానర్ నిర్మిస్తోంది. మరోవైపు తమిళ్ లో కరుప్పు అనే తమిళ్ మూవీ చేస్తున్నాడు. ఇది వేగంగా చిత్రీకరణ చేస్తోంది. ఇదే టైమ్ లో అన్నట్టుగా మళయాలంలోకి అడుగు పెడుతున్నాడు సూర్య. అతనికి మాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆ మార్కెట్ ను పట్టుకోవడానికి చాలాకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.కాకపోతే బడ్జెట్ కారణంగా ఆగిపోయి ఉండొచ్చు. బట్ ఇప్పుడు ఆ పరిస్థితులేం లేవు కాబట్టి సూర్య మాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు.

సూర్య 47వ సినిమాగా మొదలు కాబోతోంది. ఈ చిత్రం డిసెంబర్ 8 నుంచి ప్రారంభం కాబోతోంది. కేరళలోనే చిత్రీకరణ మొదలుపెట్టబోతున్నాడు. హీరోయిన్ గా నజ్రియా నటించబోతోంది. ఈ మధ్య ప్రేమలు మూవీతో ఆకట్టుకున్నాడు నాస్లేన్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అతను ఈ మధ్య ఎక్కువ పాత్రలతో కనిపించడం ఇబ్బంది కరం అనే చెప్పాలి. ఇక సూర్య దాదాపు ఓ దశాబ్దం తర్వాత పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు ఈ మూవీతో. అన్నట్టు మళయాలంలో మూవీ సూర్య పోలీస్ గానే కనిపిస్తాడన్నమాట. అన్నట్టు ఈ చిత్రంతో జీతూ మాధవన్ డైరెక్షన్ చేస్తున్నాడు.

మొత్తంగా సూర్య లాంగ్వేజ్ బారికేడ్స్ దాటేస్తున్నాడు. కొన్నాళ్లుగా తమిళ్ లో మంచి మూవీస్ చేయలేకపోతున్నాడు. ఈ టైమ్ లో తెలుగు, మళయాలంలో మూవీస్ చేయబోతున్నాడు అంటే అదీ ఓ రకంగా మంచిదే అని చెప్పాలి. 

Tags:    

Similar News