Sushmita Sen : అందుకే నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు : సుస్మితాసేన్

Sushmita Sen : సుస్మితాసేన్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే.;

Update: 2022-07-22 06:15 GMT

Sushmita Sen : సుస్మితాసేన్ ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇప్పడివరకు సుస్మితా ఎందుకు పెళ్లిచేసుకోలేదనేదానిపై గతంలో ఓ ఇంటర్యూలో స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తాను జీవితంలో చాలా ఆసక్తికరమైన పురుషులను కలిసానని.. వాళ్లల్లో నెలకొన్న నిరాశ నిరుత్సాహమే తనను పెళ్లిచేసుకోకుండా చేసిందన్నారు.

తాను ఎవ్వరితోనైనా రిలేషన్‌లో ఉన్నప్పుడు, తన పిల్లలు కూడా వారిని సాదరంగా ఆహ్వానించేవారన్నారు. చూడడానికి ఇది కొత్తగా సంతోషంగా కూడా నాకు అనిపించేది. నా లైఫ్‌లో మూడు సార్లు నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యా.. కానీ విధి వల్ల నేను బయటపడ్డ.. పెళ్లి చేసుకోలేదు. నన్ను నా ఇద్దరు పిల్లలు దేవుడు సురక్షితంగా చూసుకుంటున్నాడనే నమ్మకం నాకుంది అన్నారు.

విశ్వ సుందరి సుస్మిత 24ఏళ్ల వయసులోనే రీనా అనే ఆడపిల్లను దత్తత తీసుకుంది. 2010లో అలీషా అనే మరో ఆడపిల్లను దత్తత తీసుకుంది. రీనా ఓ షార్ట్ ఫిలింలో కూడా నటించింది. ఇటీవళ సుస్మితాసేన్ లలిత్ మోడీతో డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే సుస్మిత పెళ్లి చేసుకుంటుందా లేక రిలేషన్‌షిప్‌లోనే ఉంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News