Taapsee Pannu : అలా అనే సరికి కోపమొచ్చింది : తాప్సీ పన్ను

Update: 2024-10-21 17:15 GMT

బాలీవుడ్ స్టార్ బ్యూటీ తాప్సీ పన్ను అడపాదడపా మీడియా ముందుకు వస్తూనే ఉంటుంది. ఇటీవల కొందరు ఫోటో గ్రాఫర్ల తీరుతో ఆమెకు కోపమొచ్చింది. ముంబైలో ఖేల్ ఖేల్ మే మూవీ డైరెక్టర్ ముదస్ అజీజ్ ను ఆమె కలిశారు. అనంతరం తన కారు వద్దకు వచ్చే టైంలో కొందరు ఫోటో గ్రాఫర్లు పదే పదే ఆమె పేరునే పిలుస్తూ ఆమెకు కోపం తెప్పించారు. దీంతో ఆమె చిరాకుతో ' భాయ్ సాహబ్, కహాసే ఆ జాతే హై యార్' (ఎక్కడి నుంచి వచ్చార్ బ్రదర్) అని కామెంట్స్ చేసింది. ఈ విషయంపై ఫీవర్ ఎఫ్ఎమ్ లో తాప్సీ మాట్లాడుతూ.. కొందరు పాపాత్ముల వల్లనే తన సినిమాలకు గుర్తింపు రావట్లేదు అంది. మీడియాలో తన సినిమాలను హైలెట్ చేయాల్సిన అవసరం లేదంది. “నేను వారిని మీడియా అని పిలవను. మీడియా అలా చేయకూడదు. నిర్విరామంగా లైన్లు లేదా వీడియోలను ఉంచారు, జిసేపే బాస్ క్లిక్ కర్నా పాడే (అవి క్లికైట్),” అని అంది. తాప్సీ చివరిసారిగా ఖేల్ ఖేల్ మే సినిమాలో కనిపించింది.

Tags:    

Similar News