మిల్కీ బ్యూటీ తమన్నా.. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో చాలాకాలంగా మూడు ముక్కలాట ఆడుతోంది. పెద్ద స్టార్ల సరసన చాన్స్ లు రాకపోయినా, తెలివిగా కెరీర్ ను లాంగ్ రన్ ని కొనసాగిస్తోంది. అయితే ఇండస్ట్రీకి వచ్చి 20 ఏండ్లు అయినా.. ఆమె అందం ఏ మాత్రం చెక్కు చెదరలేదు. తన లుక్స్ ఇప్పటికీ కుర్రకారు హృదయాలను గెలిచేస్తుంది ఈ బ్యూటీ. మరోవైపు సోషల్ మీడియాల్లోనూ స్పీడ్ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా గోల్డెన్ లెహంగాలో తమన్నా తళుక్కున మెరిసింది. మనీష్ జీ డిజైనర్ దుస్తుల్లో గ్లామ్ అవతార్ ఒక గొప్ప అనుభూతి అంటూ మిల్కీ బ్యూటీ ఆనందం వ్యక్తం చేసింది. ఆ కోచర్ పార్టీ ప్రత్యేకమైనది.. ఎంత అద్భు తమైన రాత్రి.. ఇనయా అనేది స్వచ్ఛమైన కవిత్వం.. మీలాగా ఎవరూ గ్లామరస్ గా మార్చలే రు! అంటూ డిజైనర్ మనీష్ మల్హోత్రాను ప్రశంసించింది. ఇక సినిమాల విషయానికొస్తే ఇటీవల సూపర్ నేచురల్ థ్రిల్లర్ 'ఓదెలా 2'లో అలరించిన ఈ ముద్దుగుమ్మ.. అజయ్ దేవ్న్ ‘రైడ్ 2’లో నాషా అనే ప్రత్యేక పాటలో నర్తించింది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీ స్లలో నటిస్తూ మెప్పిస్తోంది. 'డేరింగ్ పార్టనర్స్' వెబ్ సిరీస్లో డయానా పెంటీతో కలిసి కనిపించనుంది. ఇందులో జావేద్ జాఫెరి నకుల్ మెహతా తదితరులు నటించారు. అలాగే అజయ్ దేవగన్ సంజయ్ దత్ లతో పాటు అడ్వెంచర్ థ్రిల్లర్ 'రేంజర్'లో తమన్నా కథానాయికగా నటిస్తోంది. జగన్ శక్తి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం 2026లో విడుదల కానుంది.