Telugu Actress Rimi : రూ.4 కోట్లు మోసపోయిన చిరు హీరోయిన్

Update: 2024-06-20 05:40 GMT

హీరోయిన్ రిమీ సేన్ ( Rimi Sen ) రూ.4.14 కోట్లు మోసపోయారు. అధిక వడ్డీకి ఆశపడి మూడేళ్ల క్రితం తన ఫ్రెండ్ రోనక్‌ వ్యాస్‌కు విడతల వారీగా ఆమె రూ.4.14 కోట్లు ఇచ్చారు. అవి వడ్డీతో సహా రూ.14 కోట్ల మేర అయ్యాయి. కానీ అతడు కనిపించకుండా పోవడంతో ఆమె ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ కేసు సీఐడీకి బదిలీ అయింది. కాగా నీతోడు కావాలి, అందరివాడు సినిమాల్లో రిమీ సేన్ నటించారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన అందరివాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ రిమిసేన్. అంతకు ముందు నా మొదటి ప్రేమలేఖ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి పెట్టిన ఈ బ్యూటీ.. అందరివాడు మూవీతో పాపులర్ అయ్యింది. తెలుగు, హిందీ భాషల్లో వరసు సినిమాల్లో నటించిన రిమిసేన్.. కొన్నాళ్లుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. రిమి సేన్ చివరగా 2011లో షాగిర్ద్ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాతి నుంచి నటనకు దూరంగా ఉన్నారు.

Tags:    

Similar News