Thalapathy Vijay : పునీత్ సమాధి వద్ద నివాళులు అర్పించిన దళపతి విజయ్..!
Thalapathy Vijay : గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించిన సంగతి తెలిసిందే.;
Vijay : గతేడాది అక్టోబర్ 29న గుండెపోటుతో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన మరణం ఇండస్ట్రీలోని ప్రముఖులను మాత్రమే కాదు.. యావత్ సినీ ప్రపంచాన్ని, అభిమానులను కలిచివేసింది. పునీత్ ఆత్మకి శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు దైర్యాన్ని ప్రసాదించాలని అందరు కోరుకుంటున్నారు. కొందరు హీరోలు అయితే పునీత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.వారికి దైర్యాన్ని చెబుతున్నారు.
అందులో భాగంగానే బెంగుళూరులోని కంఠీరవ స్టూడియోస్‌లోని పునీత్ రాజ్‌కుమార్ సమాధిని నేడు(ఫిబ్రవరి 26) దర్శించి నివాళులు అర్పించారు తమిళ నటుడు తలపతి విజయ్. అనంతరం పునీత్ కుటుంబ సభ్యులను పరామర్శించారు విజయ్. పునీత్ రాజ్‌కుమార్ సమాధి వద్ద విజయ్ ఎమోషనల్ అయ్యారు. పునీత్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
#ThalapathyVijay @actorvijay paid his last respect to late actor #PuneethRajkumar pic.twitter.com/txbae8Qrw5
— BA Raju's Team (@baraju_SuperHit) February 26, 2022