Actor Kiriti : వైరల్ వయ్యారికి తన స్టెప్స్ తో అదరగొట్టిన చిన్నారి..మెచ్చుకున్న హీరో కిరీటి

Update: 2025-07-25 05:52 GMT

ఇటీవలే విడుదలైన జూనియర్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రముఖ వ్యాపార వేత్త, మాజీ మంత్రి గాలి జనార్ధన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా లో శ్రీ లీలా హీరోయిన్ గా అలరించగా జెనీలియా కీలక పాత్ర పోషించారు. జూలై 18 తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్ అయిన జూనియర్ హిట్ టాక్ ను కైవసం చేసుకుంది..కాగా ఈ సినిమా లోని వైరల్ వయ్యారి పాట బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. హీరో, హీరోయిన్లు ఇద్దరూ పోటీ పడి మరి వేసిన ఈ సాంగ్ స్టెప్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ పాట కు సంబంధించిన రీల్స్, షార్ట్లు సోషల్ మీడియాలో రచ్చచేస్తున్నాయి.

తాజాగా స్కూల్ యూనిఫాం లో ఓ చిన్నారి చేసిన డాన్స్ అందరిని ఆకట్టుకుంటుంది. బళ్లారి కి చెందిన పూజా అనే అమ్మాయి వైరల్ వయ్యారి పాటకు తన స్టెప్పులతో అదరగొట్టింది. హీరో కిరీటి ముందే ఎనర్జిటిక్ గా స్టెప్పులు వేసింది. కాగా ఈ చిన్నారి డాన్స్ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు హీరో కిరీటి. తన డాన్స్ చాలా బాగుంది అని మెచ్చుకుంటూ తనకి ఒక కానుక కూడా అందించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Tags:    

Similar News