Tillu Square : టిల్లు సినిమాపై క్రేజీ అప్ డేట్
'టిల్లు స్క్వేర్' మూవీ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్;
తెలుగు రాష్ట్రాల్లో యూత్ ప్రేక్షకులను అత్యంత ఎక్కువగా ఆకర్షించిన 'డీజే టిల్లు'.. ఇప్పుడు దాని సీక్వెల్' టిల్లు స్క్వేర్' తో అలరించేందుకు సిద్ధమవుతోంది. టిల్లుగా సిద్దు జొన్నలగడ్డ నటన మరింత పాపులర్ అయ్యింది. అయితే ఈ సినిమాపై తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఫిబ్రవరి 9, 2024న 'టిల్లు స్క్వేర్'ను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా ఒరిజినల్‌గా వినోదాత్మకంగా ఉంటుందని మేకర్స్ హామీ ఇచ్చారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాలపై సాయి సౌజన్య టిల్లు స్క్వేర్‌ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఆమె బోల్డ్ లుక్ విపరీతంగా వైరల్‌గా మారింది. మల్లిక్ రామ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ 'టిల్ స్క్వేర్'కి రామ్ మిరియాల సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టికెట్ ఎహ్ కొనకుండా అనే సింగిల్ వైరల్‌గా మారడంతో ఈ సినిమా భారీ హిట్ అవుతుందనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
అంతకుముందు సితార్ ఎంటర్టైన్ మెంట్ ఓ కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ 27న ఉదయం 11.07నిమిషాలకు ఓ మేజర్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ అప్ డేట్ ను మిస్ కావొద్దని కూడా ఓ ట్వీట్ చేసింది. దీంతో ఎలాంటి అప్ డేట్ ఇవ్వబోతున్నారన్న వారికి... తాజాగా మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు.
His-Story will repeat once again in theatres with #TilluSquare! 😎🕺
— Sithara Entertainments (@SitharaEnts) October 27, 2023
Tillu anna MASS is all set to blast the theatres with DOUBLE the FUN & DOUBLE ENTERTAINMENT from FEB 9th, 2024! 🔥🤩#TilluSquareOnFeb9th 🤟#Siddu @anupamahere @MallikRam99 @ram_miriyala @NavinNooli… pic.twitter.com/LPdKINmS18