BHAIRAVAM : భైరవం నుంచి వరదా పాత్ర థీమ్ సాంగ్

Update: 2025-05-27 12:00 GMT

ముగ్గురు హీరోల సినిమాలు ఈ మధ్య పెద్దగా రావడం లేదు. ఆ లోటును తీరుస్తూ.. భైరవం వస్తోంది. ముగ్గురికీ పెద్ద స్టార్డమ్ లేదు. కాకపోతే ఎవరికి వారికి కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి ముగ్గురు హీరోల సినిమా కాబట్టే టాలీవుడ్ తో పాటు ఆడియన్స్ లోనూ భైరవంపై మంచి క్రేజ్ ఉంది. ఈ నెల 30న విడుదల కాబోతోన్న భైరవం నుంచి నారా రోహిత్ పోషించిన వరదా పాత్ర థీమ్ సాంగ్ విడుదలైంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కనకమేడల డైరెక్ట్ చేశాడు. తమిళ్ లో గరుడన్ పేరుతో విడుదలై గతేడాది మంచి విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు.

ఇక నారా రోహిత్ వరద అనే పాత్రలో కనిపించబోతున్నాడు. అతని పాత్ర ఎలా ఉంటుందో తెలియజేస్తూ సాగే గీతమే ఈ థీమ్ సాంగ్. ఆ పాత్ర ధర్మానికి, త్యాగానికి కట్టుబడి ఉంటుందన్న అర్థంలో సాగినా.. ఓవరాల్ సాంగ్ చూస్తే గూస్ బంప్స్ వచ్చేలా ఉందనే చెప్పాలి.

‘‘దర్భను ధనువుగ చేసిన ఘనుడు.. దుర్జన బంజనకారుడు.. శతృవు పాలిట మృత్యువు ఇతడు.. సత్యము గీతను దాటడు.. స్నేహాన్నే వీడిపోడు.. ఏ స్వార్థాన్నే కోరడు.. ధర్మాన్నే దారి తప్పగా ధైర్యం చూపే దైవం వారసుడు’’.. అంటూ పూర్ణాచారి రాసిన పల్లవితోనే ఆ వరదా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో చెప్పేశాడు. దీనికి శ్రీ చరణ్ పాకాల అందించిన సంగీతం అదిరిపోయింది. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలతో పాటు నారా రోహిత్ ఎక్స్ ప్రెషన్స్ ఎక్స్ ట్రార్డినరీగా కనిపిస్తున్నాయి. రోహిత్ మంచి నటుడు అని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి మల్టీస్టారర్స్ లో స్పెషల్ రోల్స్ ఉన్నప్పుడు మరింత ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలియకుండానే కనిపించే పోటీలో తామే బెస్ట్ అనిపించుకోవాలనే తాపత్రయం కూడా ఉంటుంది. మిగతా పాత్రలేమో కానీ.. రోహిత్ మాత్రం అదరగొట్టాడు అనే చెప్పాలి.

Tags:    

Similar News