Pawan Kalyan : ఓ.జి సాంగ్ .. పట్టుకొచ్చే విచ్చుకత్తి

Update: 2025-08-02 09:32 GMT

పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘ఓ.జి’. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. యేడాదికి పైగా ఆలస్యం అయిన ఈ చిత్రాన్ని ఈ సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. తాజాగా ఓ.జి నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ పాటపై ముందు నుంచీ హైప్ పెంచుతూనే ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తో పాటు ఇతర టీమ్ అంతా ఈ సాంగ్ ఒక మత్తులా ఉంటుందని చెబుతూ వచ్చారు. ఫైనల్ గా సాంగ్ వచ్చేసింది.

పాటలతో ప్రయోగాలు చేయడం పవన్ కళ్యాణ్ కు ముందు నుంచీ అలవాటు. ఖుషీలో ఫస్ట్ టైమ్ తెలుగు సినిమాలో హిందీ పాట పెట్టేశాడు. అప్పుడప్పుడూ ఇంగ్లీష్ లైన్స్ వాడాడు. ఈ పాటలో కూడా సగం ఇంగ్లీష్, సగం తెలుగుతో పాటు అక్కడక్కడా జపనీస్ పదాలు మిక్స్ అయి కనిపిస్తోంది. రెండు వెర్షన్స్ లోనూ హై మూమెంట్ వచ్చే పదాలు కనిపిస్తున్నాయి. సాహిత్యం పరంగా హీరో క్యారెక్టర్ ను ఎలివేట్ చేయడానికి కావాల్సినన్ని వర్డ్స్ వాడేశారు. అవన్నీ బావున్నాయి.

ఇక తెలుగు పాటను విశ్వ, శ్రీనివాస మౌళి రాయగా ఇంగ్లీష్ లైన్స్ ను రాజకుమారి రాసింది. ఇక జపనీస్ లిరిక్స్ ను అద్వితీయ వజ్జల రాశారు. సో.. ఇదో మాంటేజ సాంగ్ లా కనిపిస్తోంది. ఇలాంటి పాటలు ఆడియోగా ఎంత ఆకట్టుకుంటాయో.. వీడియోతో పాటూ అంతే ఆకట్టుకుంటాయి. పంజా తర్వాత పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటించిన సినిమా ఇది. అటు సాహో తర్వాత సుజిత్ డైరెక్ట్ చేసిన మూవీ. అందుకే అంచనాలు భారీగా ఉన్నాయి. వాటిని మరింత పెంచేలానే ఈ పాట కూడా కనిపిస్తోంది.

Full View

Tags:    

Similar News