తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.
నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది నభా. మొదటి చిత్రంతోనే యూత్ అడియన్స్ మనసు దోచుకుంది. గ్లామర్, యాక్టింగ్ పరంగా వెండితెరపై మాయ చేసింది నభా.ఆ తర్వాత రామ్ పోతినేని సరసన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసింది. డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాతో నభా ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. దీంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో నభా పేరు మారుమోగింది.