నీరజ్ ఘైవాన్ దర్శకత్వంలో తెరకెక్కిన రెండో చిత్రం ‘హోమ్ బౌండ్’. ప్రముఖ నటులు ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా.. ఈ ఏడాది జరగనున్న కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితం కానుంది. ఈగౌరవాన్ని పొందిన నేపథ్యంలో జాన్వీ కపూర్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో వ్యక్తపరిచింది. జాన్వీ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా స్పందిస్తూ 'భారతీయ సినిమా ప్రపంచాన్ని ఆకర్షించే క్షణాలివి. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మా సినిమా 'హోమ్ బౌండ్' సందడి చేయనుంది. మా టీమ్ కు ఇది గొప్ప గౌరవం. మా హృదయాలు ఆనందంతో నిండిపో యాయి. ఈ మూవీని ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం' అంటూ పేర్కొంది. ఇక ఈ ఏడాది కేన్స్ కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. 78వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ ఏడాది మే 13 నుంచి 24 వరకు ఫ్రాన్స్ వేదికగా జరగనుంది. ఇక సినిమాల విషయానికొస్తే జాన్వీ చివరిగా దేవరలో కనిపించింది. ఇందులో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించింది. త్వరలో నే దేవర 2 షూటింగ్ మొదలుకానుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పరాణ్ సుందరి చిత్రంలో వరుణ్ ధావన్, నటి సన్యా మల్హోత్రాతో కలిసి సన్నీ సంస్కారి కి తులసి కుమారి చిత్రంలో కూడా నటిస్తుంది. వీటి తోపాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటి స్తున్న ఆర్సీ 16 సినిమాలోనూ బిజీగా ఉంది.